బడ్జెట్ లో పెట్టేశారు : అగ్రిగోల్డ్ బాధితులకు వెయ్యి కోట్లు

Submitted on 12 July 2019
YSrcp manifesto Agrigold 1150 Estimates In Budget

ఏళ్ల తరబడి కళ్లు కాయలయ్యేలా ఎదురు చూసిన అగ్రిగోల్డ్ డిపాజిటర్ల చేతికి త్వరలోనే డబ్బులు అందనున్నాయి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం బాధితులకు డబ్బులు అందచేసేందుకు బడ్జెట్‌లో 11 వందల 50 కోట్ల రూపాయలు కేటాయించింది. 2019, జులై 12వ తేదీ శుక్రవారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. వివిధ రంగాలకు కేటాయింపులు చేశారు. అందులో ప్రధానమైంది అగ్రిగోల్డ్. 

ఎన్నికలకంటే ముందు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఆనాడు జగన్ స్వయంగా ప్రకటించారు. అంతేగాకుండ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 1,150 కోట్లు కేటాయించి తద్వార..గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఉన్న 13 లక్షల మంది బాధితులకు మేలు చేస్తామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్‌లో వీరికి చెప్పిన విధంగానే కేటాయింపులు జరిపింది జగన్ ప్రభుత్వం. 

దీనిపై అగ్రిగోల్డ్ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్‌లో ఎవరు ఎంత డిపాజిట్ చేశారు..వారి సంఖ్య ఎంత..ఎంతమందికి ఇస్తే న్యాయం జరుగుతుంది..తదితర వివరాలను స్టడీ చేస్తున్నారు అధికారులు. ఆగస్టులోపు దీనిని క్లియర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. గత ప్రభుత్వం కేటాయించిన డబ్బు..అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బు..ఇలా..నిధులను కలుపుకుని అగ్రిగోల్డ్ బాధితులకు పంపిణీ చేయనుంది. 

Ysrcp
manifesto
agrigold
Budjet 2019-20


మరిన్ని వార్తలు