Zomato కస్టమర్లకు చేదువార్త : సమ్మెలోకి డెలివరీ బాయ్స్?

Submitted on 11 August 2019
Zomato delivery boys to strike

జొమాటో డెలివరీ బాయ్స్ సమ్మెలోకి వెళుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ సంస్థకు చెందిన బాయ్స్ ఆగస్టు 12వ తేదీ సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కస్టమర్లు ఆర్డర్ చేసే ఆహారం..మత మనోభావాలు దెబ్బతీస్తోందని అందుకే సమ్మెలోకి వెళుతారని సమాచారం.

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో యాప్‌లో జొమాటో కూడా ఒకటి. దేశంలోని అనేక నగరాలు..పట్టణాల్లో ఈ సంస్థ ఔట్ లెట్లు ఉన్నాయి. రెస్టారెంట్లు..ఇతరత్రా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. కస్టమర్లు ఆర్డర్ చేసే ఫుడ్ ఐటమ్స్‌ని బాయ్స్ డెలివరీ చేస్తుంటారు. ఇందులో అనేక మతాలకు చెందిన వారు ఉన్నారు. బక్రీద్ సందర్భంగా కొన్ని ఆహార పదార్థాల ఆర్డర్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మత విశ్వాసాలను దెబ్బతీసినట్లు అవుతుందని బాయ్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాకుండా..సంస్థ అందిస్తున్న కమిషన్..మెడికల్ ఇతర సదుపాయాలు కూడా సరిగ్గా లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో..సమస్యలు పరిష్కారం కావాలంటే..సమ్మెలోకి వెళ్లడమేనని వీరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్డర్ చేసే ఆహారం కొన్ని వర్గాల వారిని దెబ్బతీసే విధంగా ఉందంటున్నారు. ఇటీవలే ఓ సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై జొమాటో యాజమాన్యం ఇంకా స్పందించలేదు. మరి జొమాటో డెలివరీ బాయ్స్ సమ్మె‌లోకి వెళుతారా ? లేదా ? అనేది చూడాలి. 

zomato
delivery boys
Strike
Food Delivary

మరిన్ని వార్తలు