10-year-olds find gold bars worth Rs 64.7 lakhs while making makeshift den in garden

పదేళ్ల పిల్లోడికి రూ.65 లక్షల విలువ చేసే బంగారం దొరికింది..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్‌డౌన్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పిల్లలు కూడా తమ ఆటపాటల్లో మార్పులు చేసుకుని టైంపాస్ చేసేస్తున్నారు. ఇండోర్ గేమ్స్ లో చాలా మంది ఫిక్స్ అయిపోతుంటే, కొందరు క్రియేటివ్ మైండ్ ఓపెన్ చేసి, ఎంటర్ టైన్మెంట్ తో గడిపేస్తున్నారు. ఫ్రాన్స్ లో ఇలాగే ఇద్దరు సోదరులు సరదాగా ఆడుకుంటూ చేసిన పని వారి జీవితాలనే మార్చేసింది. 

పాడైపోయిన వస్తువులు ఆకులతో తోటలో ఆడుకుంటుండగా బంగారం బిస్కట్ దొరికింది. వారు ఆడుకుంటుండగా రెండు వస్తువులు కిందపడిపోయాయి. అవేంటో తెలియక వాటిని తిరిగి పెట్టేద్దామనుకున్నారు. కానీ, అది కొత్త వస్తువుగా అనిపించడంతో వారి తండ్రికి చెప్పారు. వారంతా కలిసి ఆ వస్తువును పరిశీలించి బంగారంగా నిర్థారించారు. 

కొన్ని ఫొటోలను పంపిన తర్వాత అదే రిపోర్టు వచ్చింది. అది వాళ్లమ్మకు చెందినదిగా ఆ వ్యక్తి అభిప్రాయపడుతున్నాడు. కేజీ బరువు ఉండే బంగారం బార్లను కొనుగోలు చేసిన రశీదులను బయటకు తీసుకొచ్చాడు. మా బామ్మ 1967లో వీటిని కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ గోల్డ్ బార్లు రౌలిక్ వేలందారుల వెబ్ సైట్ లో ఉంచారు. ఇప్పుడు అవి దాదాపు ఒక్కొక్కటి రూ.33లక్షలకు పైగా పలుకుతోంది. ఇంకా ఎక్కువ ధర వస్తుందని ఆశిస్తున్నట్లు వెబ్ సైట్ నిర్వాహకులు చెప్తున్నారు. 

Read: లాక్‌డౌన్ తరువాత కూడా కరోనా రిలీఫ్ న్యూజిలాండ్ : బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తున్న చిన్నారులు 

Related Tags :

Related Posts :