1000 kg bombs, Mirage 2000 jets: India attacks Pakistan

యుద్ధం వచ్చేసింది : పాక్ పై బాంబులతో విరుచుకుపడిన భారత్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై కౌంటర్ ఎటాక్ చేసింది. భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్ 2000 జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై 1000కిలోల బాంబులతో దాడికి పాల్పడ్డారు. పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన భారత్.. పాకిస్థాన్ దేశంలోని సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరంలోని ఖైబర్ ఫక్తూన్ ఖావా ప్రావిన్సులోని బాలకట్ పట్టణం వద్ద ఉగ్రవాదుల శిబిరాలపై భారత నేవి దాడులు చేసినట్లు తెలుస్తుంది. ఈ సంధర్భంగా ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. 

2016లోనూ ఉరి పట్టణంలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రదాడి అనంతరం మన సైనికులు సర్జికల్ దాడులు చేశారు. బాలాకోట్, చాకోటి, ముజఫ్పరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. అంతకు ముందు భారత వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ పరిధిలోకి రావడానికి ప్రయత్నించిందని.. పాకిస్తాన్ ఎయిర్‌‌ఫోర్స్ తక్షణమే తిప్పికొట్టడంతో వెనుదిరిగిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి, మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్ సెక్టార్‌లో భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు ప్రవేశించాయని ఆసిఫ్ ఆరోపించారు.
 

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వాయసేన మెరుపు దాడులు నిర్వహించింది. తెల్లవారుజామున 3.30 గంటలకు మిరాజ్ జెట్స్‌ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడుల జరిపారు. ఈ దాడులను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. పీవోకేలో దాడులు అంతర్జాతీయ ఉల్లంఘన కిందకి రావని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. పీవోకే భారత్‌లోని భూభాగమేనని స్పష్టం చేశారు. ఇదిలావుంటే భారత్ విమానాలు తమ భూభాగంలోకి వచ్చాయని పాకిస్తాన్ స్పష్టం చేసింది. సో.. బోర్డర్ దాటారు.. యుద్ధం వచ్చేసింది..
 

Related Posts