లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

101 ఏళ్ల బామ్మకి మూడవసారి కరోనా పాజిటివ్

Published

on

101 year old woman tests positive again ఇటలీకి చెందిన మరియా ఆర్సింఘర్ అనే 101ఏళ్ల బామ్మకి మూడోసారి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. స్పానిష్ ప్లూ,రెండో ప్రపంచ యుద్దం కాలంనాటి పరిస్థితులను కూడా తట్టుకుని జీవించిన ఈ బామ్మకు ఏడాదిలోపే మూడోసారి కరోనా పాజిటివ్ వచ్చింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో మరియా ఆర్సింఘర్(101)కి మొదటిసారి కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్నిరోజుల ట్రీట్మెంట్ తర్వాత తిరిగికోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయింది. అయితే, మరియా ఆర్సింఘర్.. మళ్లీ సెప్టెంబర్ లో రెండోసారి కరోనా బారిన పడ్డారు. అప్పుడు 18రోజుల ట్రీట్మెంట్ తర్వాత తిరిగి కోలుకుంది. అయితే, తన వయస్సు కారణంగా ఆమె అనేక ఇతర అనారోగ్య ప్రమాదాలను ఆమె ఎదుర్కోవాల్సివచ్చిందని డాక్టర్లు పేర్కొన్నారు.కాగా,ప్రస్తుతం ఈ వయోవృద్ధురాలు నవంబర్ లో మరోసారి కరోనాబారిన పడింది. అయితే ఈసారి పాజిటివ్ వచ్చినప్పటికీ ఆమెలో కరోనా లక్షణాలు కనిపించలేదు(asymptomatic). జ్వరం,శ్వాసకోస సమస్యలు ఆమెలో మరోసారి తలెత్తలేదు. కాగా,ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.మరోవైపు, 100ఏళ్లు పైబడి కరోనాని జయించిన మొదటి వ్యక్తి మరియా ఆర్సింఘర్ మాత్రమే కాదు. ఈ ఏడాది ఆగస్టు నెలలో కేరళలోని అలువా నివాసి 103ఏళ్ల పురక్కత్ వీట్టిల్ కరోనాని జయించిన విషయం తెలిసిందే. అదేవిధంగా సెప్టెంబర్ లో పూణేకి చెందిన 106ఏళ్ల ఆనందీభాయ్ పాటిల్ కరోనాని జయించిన విషయం తెలిసిందే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *