102-year-old readies CV as BJP puts him to freedom fighter test

నేను స్వాతంత్ర్య పోరాటయోధుడినే : ఇవిగో ప్రూఫ్స్ అంటున్న 102 ఏళ్ల భారతీయుడు!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

102 ఏళ్ల భారత్ స్వాతంత్ర్య సమరయోధుడు నేను భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాను..దేశం కోసం నాప్రాణాలకు సైతం అర్పించేందుకు పోరాడాను అని నిరూపించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. క్విట్ ఇండియా ఉద్యమం, వినోభా భావే హూదాన్ ఉద్యమం వంటి ఉద్యమం వంటి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు హెచ్ఎస్ డోరేస్వామి తన సీవీ (curriculum vitae)ని రాశారు. 

దీనికి కారణం బీజేపీ నేత నోటి దురుసు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ )ను వ్యతిరేకిస్తు డోరేస్వామి స్థానికంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో గంగవెర్రులెత్తిపోయిన బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగగౌడపాటిల్ యత్నాల్ గత ఫిబ్రవరి నెలలలో డోరేస్వామిని ‘‘నకిలీ స్వాతంత్ర్య సమరయోధుడు’’ ‘‘పాకిస్థాన్ ఏజెంట్’’ ‘‘దేశద్రోహి’’అంటూ ఆరోపణలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడైన డోరేస్వామిని అవమానకరంగా మాట్లాడారు. బసంగగౌడ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి పల్హాద్ జోషితో సహా పలువురు బీజేపీ నేతలు మద్దతు పలికారు. దీంతో అటువంటి వ్యక్తుల నోటిలో నోరు పెట్టకుండా తన దేశభక్తిని చాటి చెప్పేందుకు డోరేస్వామి తన సీవీని రాస్తున్నారు. తాను ఎక్కడ పుట్టారో? భారత్ స్వాతంత్ర్యం సమరసంగ్రామంలో తాను ఎటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు? అనే వివరాలతో కూడిన వివరాలను రాశారు డోరేస్వామి. 

దక్షిణ బెంగళూరులో 1918లో పుట్టిన డోరేస్వామి క్విట్ ఇండియా ఉద్యమం, వినోభా భావే హూదాన్ ఉద్యమం వంటి ఉద్యమం వంటి ఎన్నో..ఎన్నెన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు . ఇటీవల బెంగళూరులోని సరస్సుల ను పునరుద్ధరించాలనే ప్రచారాలతో నేటికి పలు ఉద్యమాల్లో డోరేస్వామి కీలక పాత్ర వహిస్తున్నారు. 25 సంవతరాల నవయువకుడిగా..అవివాహితుడిగా ఉన్న డోరేస్వామి భారత స్వాత్రంత్య సంగ్రామంలో తాను చేసిన పలు ఉద్యమాలు..ప్రస్తుత పరిస్థితుల్లో పలు ఉద్యమాల్లో తన పాత్ర..ఉద్యమంలో భాగంగా తాను జైలుశిక్షలు అనువించటంత వంటి వంటి పలు అంశాలతో కూడా సీవీని రాశారు. 1942 డిసెంబర్ 18న  దాన్ని బెంగళూరు సెంట్రల్ జైలులో డోరేస్వామి శిక్ష అనుభవించీ..తిరిగి డిసెంబర్ 8,1943న విడుదల అయినట్లుగా బెంగళూరు సెంట్రల్ జైలు సీనియర్ సూపరింటెండెంట్ తో దృవీకరణ సంతకం పెట్టించారు.  

ఈ సందర్భంగా 102 ఏళ్ల డోరేస్వామి మాట్లాడుతూ..‘‘మహాత్మాగాంధీ పిలుపుమేరకు 25 సంవత్సరాల వయస్సులో స్వాతంత్ర్య పోరాటంలోకి అడుగుపెట్టాను..ఈ వయస్సులో నేను భారతీయుడిని..స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాను. వంటి అంశాలను నిరూపించుకోవాల్సి వస్తున్నందుకు..ఇటువంటి పరిస్థితుల్లోకి భారతీయులు నెట్టివేయబడుతున్నందుకు చాలా చాలా బాధగా ఉంది..నేను స్వాతంత్ర్యం పోరాటంలోనే కాక..గత 60 సంవత్సరాల నుంచీ ప్రజా జీవితంలో ఉన్నారు. మాకు ఎటువంటి భావజాలంతోను పనిలేదు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లలో కూడా నాకు స్నేహితులున్నారు. అందరం భారతీయులం అంతే.. కానీ ఈ వయస్సులో నన్ను నేను నిరూపించుకోవాల్సిన అగత్యం వచ్చిందుకు చాలా బాధగా ఉందని అవమానకరంగా ఉంది..ఇటువంటి దుస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు’’ అంటూ వాపోయారు. 

READ  Happy Christmas : దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు

ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా..చట్టాలు చేసినా ప్రశ్నించే హక్కు ప్రతీ పౌరుడికి ఉంటుంది. అది భారతీయుల హక్కు..అంతే తప్ప సీఏఏని వ్యతిరేకించి ప్రతీ వ్యక్తిని దోశద్రోహి అనటం సరికాదు.  ప్రశ్నించేవారంతా ప్రధాని మోడీని వ్యతిరేకించినట్లుగా కాదు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా మేము పోస్ట్ బాక్సుల్లో టైమ్ బాంబులు పెట్టేవాళ్లం..ఎలకకల తోకలకు బాంబులు కట్టి వాటిని రికార్డ్ గదుల్లోకి విసిరేవాళ్లం..ఇటువంటి పనులు బ్రిటీషువారికి వ్యరిరేకంగా  ఎన్నో చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు  చేసుకున్నారు. ఇటువంటి పనులు చేసినందుకు..బ్రిటీష్ వారు డోరేస్వామిని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. కానీ విడుదల అయిన తరువాత కూడా ఆయన పోరాటం మానలేదు. నిరసన కార్యక్రమాలు చేసేవాళ్లం..ఎప్పుడూ హింసాత్మక పనులకు పాల్పడలేదు. అటువంటి గాంధేయవాదినైనన్ను ‘‘పాకిస్థానీ ఏజెంట్’’అని పిలవటం చాలా అవమానంగా ఉంది..కానీ నాపై ఎటువంటి ఆరోపణలు చేసినా..ఒక భారతీయుడిగా నేను ప్రశ్నించటం మాననని స్పష్టంచేశారు డోరేస్వామి. అప్పుడు మేము బ్రిటీష్ వారిపై పోరాడాం..ఇప్పుడు మా హక్కుల కోసం పోరాడుతామని స్పష్టంచేశారుడోరేస్వామి. అదీ భారత స్వాతంత్ర్య యోధుడు ప్రతిభ అంటే..

కాగా..అధికారం చేతిలో ఉంది కదాని..స్వాతంత్ర్య సమయోధులను అవమానాలు పాలు చేస్తున్న ఈనాటి నేతలను ఏం చేయాలి? పోరాటం అనే మాటకు అర్థం కూడా తెలికుండా అధికారాలను ప్రదర్శిస్తూ..ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజలను కూడా పట్టించుకోకుండా..అధికార దర్పంతో అహంకారంతో నోటికి ఎంత వస్తే అంత మాటలు అనటం బీజేపీ నేతలకు పరిపాటిగా మారిపోయింది. ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదు..ప్రజలకు సేవచేయాలని రాజకీయాల్లోకి వచ్చామంటూ గప్పాలు చెప్పుకోవటం తప్ప ప్రజల బాగోలుగు పట్టించుకోకుండా…వివాదాస్పద వ్యాఖ్యలు..సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆఖరికి భారత స్వాతంత్ర్య సమరయోధులపై కూడా నీచాతినీఛంగా మాట్లాడుతున్న బీజేపీ నేత వ్యాఖ్యలు వింటే ఛీ..వీళ్లూ మనుషులేనా అనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చి..స్వాత్రంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాలకు ప్రతీ పౌరుడు భారతీయుడని నిరూపించుకోవాల్సిన దుస్థితి వచ్చింది.  

భారతమాత బానిస సంకెళ్లను తెంచేందుకు…భరతజాతికి స్వేచ్చా ఊపిరులు సాధించేందుకు కన్నతల్లిదండ్రులను..కట్టుకున్నవారిని..కన్నబిడ్డల్ని కూడా వదిలేసి భారత స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్న యోధులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం..మర్యాద ఎంత?వారు చేసిన త్యాగాలకు ఈనాటి నేతలు..ఇచ్చే గౌవరంఇదేనా? ‘‘నకిలీ స్వాతంత్ర్య సమరయోధుడు’’ ‘‘పాకిస్థాన్ ఏజెంట్’’ ‘‘దేశద్రోహి’’అంటూ వ్యాఖ్యనిస్తున్న వీళ్లా నేతలు అంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు.

See Also | కరోనీ ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో 16రెట్లు పెరిగిన శానిటైజర్‌ ధర

 d

Related Posts