కరోనా ట్రీట్ మెంట్ కు లక్షలు వసూలు.. ప్రైవేట్ ఆస్పత్రులపై వెయ్యికి పైగా ఫిర్యాదులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో హడలెత్తుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. కరోనా పేరుతో రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ రోగమొచ్చినా కరోనా పేరు చెప్పి ట్రీమ్ మెంట్ కోసం వేల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా ట్రీట్ మెంట్ కు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రులపై వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

లక్షల్లో బిల్లులు వేస్తున్నారంటూ 130కి పైగా ఫిర్యాదులు అందాయని అన్నారు. ఇన్సూరెన్స్ కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులకు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేయడం తమ ఉద్దేశం కాదన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్ మెంట్ కు అవకాశం ఇచ్చిన తర్వాత వేలల్లో వసూలు చేస్తున్నారు. రోజుకు కేవలం 2 వేల రూపాయలు.. ఐసీయూ, ఆక్సిజన్ ఫెసిలిటీ, వెంటిలేటర్ వరకు ఒక్కరోజులో ఒక్కో పేషెంట్ నుంచి వసూలు 9 వేలకు మించి వసూలు చేయొద్దని మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. కానీ దానికి పూర్తి భిన్నంగా ప్రైవేట్ ఆస్పిటల్స్ వ్యవహరిస్తున్న పర్వం గత 15, 20 రోజులుగా చూస్తున్నాం.

దీనికి సంబంధించి వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోచుకుంటున్న డబ్బుల బిల్లులు ఎక్కువగా ఏ హాస్పిటల్ లో వేసినా కూడా ఈ నెంబర్ కు డయల్ చేసి ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ వాట్సాప్ నెంబర్ ను కూడా క్రియేట్ చేసింది. దీనికి దాదాపు 1039 ఫిర్యాదులు కూడా అందాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పారు.

లక్షల్లో బిల్లులు వసూలు చేస్తూ కోవిడ్ పేరుతో దోచుకుంటున్నారని 130కి పైగా ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రభుత్వం కూడా పునరాలోచన మొదలు పెట్టింది. మొన్నటివరకు రెండు ఆస్పత్రులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అక్కడ ట్రీట్ మెంట్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా కొన్ని హాస్పిటల్స్ తీరు మారడం లేదనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ అందించడమనేది ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధ్యం కాదు.

ప్రైవేట్ ఆస్పత్రులు కూడా అవసరం. వెంటిలేషన్, ఐసీయూ వరకు వెళ్లిన పేషెంట్స్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేయడం అనేది లక్ష్యం కాదన్నారు. ట్రీట్ మెంట్ అందించే క్రమంలో ఎక్కడైనా అవకతవకలు జరిగి, ఎక్కువగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కడ అందినా కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి తాము సిద్ధమవుతున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు.

కౌన్సిలింగ్ ఇవ్వడం, ముందుగా వారితో మాట్లాడటం, ఇటు యాజమాన్యాలను కూర్చోబెట్టి ఇది కరెక్టైనా పద్ధితి కాదనే ప్రయత్నం చేస్తామని అయినప్పటికీ వినకపోతే వారిపై యాక్షన్ తీసుకోవడానికి వెనుకడుగు వేసేది లేదన్నారు.

Related Tags :

Related Posts :