108-ambulance-staff-left-covid-19-patient-on-roadin-anantapuram-madakasira-mandal

ఎంతకూ తగ్గట్లేదని : ఆస్పత్రినుంచి కరోనా పేషంట్‌ను 108లో తీసుకొచ్చి రోడ్డుపై పారేసారు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘కరోనా వైరస్ తో పోరాడదాం, కరోనా పేషంట్‌తో కాదు’ అంటూ సెల్ ఫోనుల్లో రింగ్ టోన్ చెవిలో సెల్లు కట్టుకుని పోరాడుతుంటూ కొంతమంది వైద్యసిబ్బంది మాత్రం కరోనా పేషెంట్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారినే కాకుండా కరోనా పేషంట్ల పట్ల కూడా అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. మరోపక్క కరోనా విభృంభిస్తున్న క్రమంలో కొత్తగా అంబులెన్స్ లను ప్రవేశపెట్టారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని అంబులెన్స్ లను అందుబాటులోకి తేవటం సీఎం జగన్ చేసిన చాలా చాలా మంచిపని.



కానీ.. ఏపీలోని అనంతపురం జిల్లా పెనుగొండలో కరోనా పేషెంట్ పట్ల దారుణంగా వ్యహరించింది అంబులెన్స్ వైద్యసిబ్బంది. కరోనా బాధితుడు గోపినాయక్ అనే 61 ఏళ్ల వ్యక్తిని నడిరోడ్డుపై పారేసి వెళ్లిపోయారు. మడకశిర మండలం గుండుమల పంచాయతీ పీఎస్ తాండాకు చెందిన గోపినాయక్ కు పదిరోజుల క్రితం కరోనాతో లక్షణాలు రావటంతో పరీక్షలు చేయించుకున్నాడు పాజిటివ్ అని తెలిసిన తరువాత ప్రభుత్వం ఆస్పత్రిలో చేరాడు. ‘చికిత్స’ చేస్తున్నా అతను ఎంతకీ కోలుకోకపోవడంతో సిబ్బంది అతణ్ని శుక్రవారం(జూలై 31) అర్ధరాత్రి అంబులెన్స్‌లో ఆస్పత్రి నుంచి బయటికి తీసుకొచ్చి108 వాహనంలో ఎక్కించుకుని రోడ్డుపైన పడేసి పోయారు.



ఆ విషయం తెలుసుకున్న స్థానికులు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు చేసేదేమీ లేదని అతణ్ని ఇంటికి తీసుకెళ్లి ఇంటి దగ్గరే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సీఎం చిత్తశుద్దితో ఆదేశాలు జారీ చేస్తున్నా ఇటువంటి ఘటనలు పలు ప్రాంతాల్లోజరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదనీ..విమర్శలు వస్తున్నాయి.

Related Posts