లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

కరోనా టీకా తీసుకున్న 108 అంబులెన్స్ డ్రైవర్‌.. గుండెపోటుతో మృతి

Updated On - 4:51 pm, Wed, 20 January 21

108 vehicle driver dies after taking corona vaccine : నిర్మల్‌ జిల్లాలో 108 వాహనం డ్రైవర్‌ విఠల్‌ మృతి చెందాడు. నిన్న కుంటాల పీహెచ్‌సీలో టీకా తీసుకున్న విఠల్‌.. ఇంటికొచ్చాక కళ్లు తిరుగుతున్నాయని చెప్పాడని బంధువులు చెప్పారు. ఆస్పత్రికి తరలిస్తుండగా విఠల్ మృతి చెందాడు. 108 వాహనం డ్రైవర్‌ గా పని చేస్తున్న విఠల్‌.. నిన్న 11.30 గంటల సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న రెండు, మూడు గంటల తర్వాత అస్వస్థతకు గురయ్యాడు.

శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉందని, కళ్లు తిరిగినట్లవుతుందని చెప్పి..తగ్గుందని అలాగే ఇంటి దగ్గర ఉన్నాడు. కానీ తగ్గకపోవడంతో చికిత్స కోసం అంబులెన్స్ లో నిర్మల్ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు పరిశీలించి విఠల్ చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే విఠల్‌ మరణానికి వ్యాక్సిన్‌కు సంబంధం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అటు విఠల్‌ గుండెపోటుతో మృతి చెందాడని నిర్మల్‌ డీఎంహెచ్‌వో ధన్‌రాజ్‌ తెలిపారు.

జనవరి 16న తెలంగాణలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. కరోనా వ్యాక్సినేషన్ ను నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అంతకుముందు..శనివారం ఉదయం 10.30 గంటలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో కరోనా టీకాను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గాంధీలో మంత్రి ఈటల ఆధ్వర్యంలో తొలి టీకాను పారిశుధ్య కార్మికురాలికి టీకా వేశారు.

తెలంగాణలో 139 సెంటర్లలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని త్వరలోనే 1,213 సెంటర్లకు విస్తరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.15 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్ల వివరాలను కో-విన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసినట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ తెలిపారు. వారంలో నాలుగు రోజులు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

వ్యాక్సినేషన్‌ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కొవిన్‌ యాప్‌ ద్వారా సమాచారం పంపారు. వైద్య సిబ్బంది గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్‌ ప్రక్రియను కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు 90 రోజులపాటు ఎలాంటి టీకా వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే వారి శరీరంలో ప్రతిరక్షకాలు ఉంటాయి కాబట్టి వైరస్‌ సోకకుండా అడ్డుకుంటాయి.

జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉన్నా టీకా వేస్తారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి టీకా వేయరు. అవయవ మార్పిడి చేసుకున్నవారికి ఎప్పటికీ టీకా వేయరు. కరోనా సోకకుండా అడ్డుకొనేందుకే టీకా వేస్తారు. కాబ్టటి వైరస్‌ సోకిన రోగులకు టీకా వేయరు.