10th Exams Should be Cancel Pawan Kalyan

10th Exams వ‌ద్దంట‌..ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిమాండ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకే ప్ర‌భుత్వం మొగ్గు చూపుతుండ‌డంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది..జులై 10వ తేదీ నుంచి ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఖ‌రారు చేశారు..ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న క్ర‌మంలో…చిన్నారుల ఆరోగ్యాన్ని ఆప‌ద‌లోకి నెట్టి..ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌డం ఎంత మాత్రం మంచిది కాదు అంటున్నారు. జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఏపీ రాష్ట్రంలో ఇప్ప‌టికే ఇంట‌ర్ ప‌రీక్ష‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం, ఫ‌లితాలు కూడా రిలీజ్ చేయ‌డం జ‌రిగిందే. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై కూడా ఓ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశారు. 
ఏపీకి పొరుగున ఉన్న త‌మిళ‌నాడు, తెలంగాణ‌, చ‌త్తీస్ గ‌డ్‌, ఒడిశా రాష్ట్రాల‌తో పాటు..దేశ వ్యాప్తంగా ఎక్క‌డా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన దాఖ‌లాలు లేవ‌ని వెల్ల‌డించారు.

డిగ్రీ, పీజీ, ఉన్న‌త‌మైన వృత్తి సంబంధిత ప‌రీక్ష‌ల‌తో పాటు..ప్ర‌వేశ‌, ఉద్యోగ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న దాఖ‌లాలు లేవ‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై హైకోర్టు స్పందించిన సంగ‌తిని గుర్తు చేశారాయ‌న‌. పిల్ల‌ల ప్రాణాలు ప‌ణంగా పెట్ట‌డానికి తాము ఎలాంటి ప‌రిస్థితుల్లో అంగీక‌రించ‌బోమ‌ని హైకోర్టు చెప్పింద‌న్నారు. దీంతో ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా..ఉత్తీర్ణ‌త‌ను ఖ‌రారు చేసింద‌న్నారు ప‌వ‌న్. 

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కేసులు ఎక్కువ‌వుతున్నాయ‌ని, 6 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయ‌న్నారు. ప‌రీక్ష కేంద్రాల‌కు పిల్ల‌ల‌ను తీసుకెళ్ల‌డం ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంద‌ని, ప్రైవేటు వాహ‌నాలు కూడా చాలా త‌క్కువ‌గా అందుబాటులో ఉన్నాయ‌న్నారు. త‌ల్లిదండ్రుల కోరిక‌, చిన్నారుల ప్రాణాల‌ను దృష్టిలో ఉంచుకుని..ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్న‌ట్లు తెలిపారు. 

 

Related Tags :

Related Posts :