10టీవీ ఎఫెక్ట్: కదిలిన పోలీస్ యంత్రాంగం.. గోరవయ్య అరెస్ట్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన కేసులో మున్సిపల్ ఉద్యోగి గోరవయ్యను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనవరాలి వయసు ఉన్న బాలికపై కామాంధుడు మారి లేటు వయస్సులో గలీజ్ పనులు చేసిన గోరవయ్యను 10టీవీ కథనాలు ఆధారంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మధ్యాహ్నం 12గంటల నుంచి 10టీవీలో వరుస కథనాలు రాగా.. కదిలిన పోలీసు యంత్రాంగం అతనిని వెంటనే పట్టుకున్నారు.కన్ను మిన్ను కానకుండా పశువులా మారి స్కూల్ ఆవరణలో ఆరాచకానికి ఒడిగట్టిన గోరవయ్య.. బాధ్యతాయుతమైన మున్సిపల్ ఉద్యోగి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ లైంగిక దాడి ఘటన కర్నూల్ జిల్లా వడ్డేగిరిలో జరిగింది. స్థానిక మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న 58 ఏళ్ల గోరవయ్య మైనర్ బాలికను భయపెట్టి తన కోరిక తీర్చుకున్నాడు.


లవర్‌తో పెళ్లికి తల్లి ఒప్పుకోలేదని హోర్డింగ్ ఎక్కిన మైనర్ బాలిక


ఈ ఘటన గురించి మైనర్ బాలిక కుటుంబానికి తెలిసినా.. ఎక్కడ పరువు పోతుందో అని భయపడి ఎవరికి చెప్పకుండా లోలోపల కుమిలిపోయింది. కాగా చొరవ తీసుకుని పసిమొగ్గపై కామాంధుడి అకృత్యాలను కథనాలుగా 10టీవీ ప్రసారం చెయ్యడంతో చివరకు గోరవయ్య జైలు పాలయ్యాడు. 10టీవీ కథనాలకు స్పందించిన పోలీసులు అతనిపై తదుపరి చర్యలకు సిద్ధం అయ్యారు.

Related Tags :

Related Posts :