11-14 ఏళ్ల విద్యార్థులకు ‘పోర్నోగ్రఫీ రకాలు’ పై అసైన్‌మెంట్ ఇచ్చిన టీచర్!

11 To 14-YO Students In UK Asked To Define Types Of Porn, As Assignment

లైంగిక విద్యలో భాగంగా 11 ఏళ్ల నుంచి 14ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులకు పోర్నోగ్రఫీకి సంబంధించి అసైన్ మెంట్ ఇచ్చాడు యూకే టీచర్. పోర్న్ రకాలను వర్ణించాలంటూ విద్యార్థులకు సూచించాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో యూకే టీచర్ క్షమాపణలు చెప్పాడు. ఆరోగ్యానికి సంబంధించి తరగతి అసైన్ మెంటులో భాగంగా విద్యార్థులకు పోర్నోగ్రీఫీ రకాలను వర్ణించాలంటూ సూచించాడు. లైంగిక విద్యకు సంబంధించి సమాచారం కోసం విద్యార్థులంతా వెబ్ సెర్చింగ్ చేసేలా దారితీసినట్టు బీబీసీ నివేదిక తెలిపింది. హుల్ ప్రాంతంలోని Archibishop Sentamu Academyకి చెందిన 11 ఏళ్ల నుంచి 14ఏళ్ల విద్యార్థులకు ఈ అసైన్ మెంట్ ఇచ్చినట్టు Hull Daily Mail నివేదించింది.

లైంగిక విద్యలో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన ‘పోర్నీగ్రఫీ రకాలు’ అసైన్ మెంట్‌ పూర్తి చేసేందుకు వెబ్‌లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదని స్కూల్ ప్రిన్సిపల్  Chay Bell స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అన్ని సమాధానాలు విద్యార్థులకు పంపిన మెటేరియల్స్‌లోనే ఉంటాయని తెలిపారు. అసైన్ మెంటులో సాఫ్ట్ పోర్న్, హార్డ్ కోర్ పోర్న్, రివేంజ్ పోర్న్ అనే మూడు రకాలను వర్ణించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. అంతేకాదు.. స్త్రీల జననేంద్రియ వైకల్యం, బ్రెస్ట్ ఐరనింగ్, ట్రాన్స్ జెండర్ పోర్న్, సెక్స్ మార్పిడి రకాలను వివరించాల్సిందిగా స్కూల్ టీచర్ సూచించినట్టు నివేదిక వెల్లడించింది. విద్యార్థుల్లో ఒకరి సోదరుడు Leon Dagon మాట్లాడుతూ.. ప్రస్థుత రోజుల్లో చాలామంది పిల్లలు తమ హోం వర్క్ పూర్తి చేసేందుకు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. మీరు ఏ మంచి విషయానికి సంబంధించి సెర్చ్ చేస్తే మంచిది చూపిస్తుంది..

చెడును వెతికితే చెడు చూపిస్తుందని తెలిపాడు. విద్యార్థుల ‘వ్యక్తిగత, సామాజిక, ఆరోగ్య విద్య (PSHE) లెర్నింగ్ లో భాగంగా స్కూల్ ఈ తరహా అసైన్ మెంట్ ఇవ్వడం జరిగిందని నివేదిక పేర్కొంది. లైంగిక విద్యతో పాటు ఆల్కాహాల్, డ్రగ్స్, స్మోకింగ్ వంటి అంశాలపై కూడా ప్రశ్నలు ఉన్నాయి. 13 ఏళ్ల వయస్సుకే టిక్ టాక్ చేయడం తన చిన్న సోదరి నేర్చేసుకుందని, ఇప్పుడు హార్డ్ కోర్ పోర్న్ అంటే ఏంటో తనను అడుగుతోందని Dagon స్కూల్ ప్రిన్సిపల్‌ను ప్రశ్నించాడు.

చిన్నారుల తల్లిదండ్రులు లేదా విద్యార్థులు ఇంటర్నెట్లో వీటిపై పొరపాటున సెర్చ్ చేసేలా ప్రేరేపిస్తే దానికి తాను నిజంగానే క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపారు. విద్యార్థులను ఎప్పుడూ ఇలాంటి అంశాలపై ఇంటర్నెట్లో సెర్చ్ చేయమని ఆదేశించమని అన్నారు. ఎందుకంటే.. టీచర్ అందించిన మెటేరియల్స్ లోనే అన్ని అసైన్ మెంట్లోని అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయని చెప్పారు. స్కూల్ నిర్వాకంపై విద్యా శాఖ స్పందించాల్సి ఉంది. 

Read: విక్టోరియా సీక్రెట్ స్టోర్లను శాశ్వతంగా మూసేస్తోంది!

మరిన్ని తాజా వార్తలు