సినీ తారలతో జతకట్టిన పవర్‌ఫుల్ పార్టనర్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చాలామంది యాక్టర్లు తమ భాగస్వాములను సినిమా సెట్ లలోనే వెతుక్కుంటారు. ఫీల్డ్ రీత్యా తిరిగే ప్రపంచం ఒకటే కావడంతో ఇద్దరూ సెట్ అవుతారని ఫీలవుతుంటారు. అందులో కొందరు మాత్రం వేరే దారి, వేరే జోడీలతో కుదిరిపోవడం చూస్తేనే ఉన్నాం. ఇది బాలీవుడ్, హాలీవుడ్ లవ్ స్టోరీల్లో చాలా స్పెషల్ మ్యారేజెస్ గా నిలిచిపోయిన ప్రేమకథలివి. మనం మచ్చుకుగా ఓ 8పవర్ ఫుల్ కపుల్స్ గురించి మాట్లాడుకుంటే అందులో ముందుండేది విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలే.

విరుష్కా జోడీ:
విరాట్ కోహ్లీ నాన్ సెలబ్రిటీ హోదాలో ఉన్నాడంటే అది కచ్చితంగా అబద్ధమే. స్టార్ క్రికెటర్ గా ఎదిగిన కోహ్లీ.. అనుష్క శర్మను 2013లో యాడ్ షూటింగ్ కోసం కలిసి.. వివాహ బంధంతో ఒకటైయ్యారు. ‘మొదటిసారి నేను తనని కలిసినప్పుడు చాలా భయపడ్డా. అప్పుడేం చేయాలో తెలియక ఓ జోక్ చేశా’ అని కోహ్లీ అమెరికన్ స్పోర్ట్స్ రిపోర్టర్ గ్రాహం బెన్ సింగర్ తో అన్నారు.

ఈ కపుల్ డిస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా ఇటలీలోని టుకానీలో పెళ్లి చేసుకున్నారు. ‘సమయం తెలియకుండా గడిచిపోతూ ఉంటే దీనిని స్వర్గం అనే అంటారు. మంచి మనిషిని పెళ్లి చేసుకుంటే అలాగే ఉంటుంది’ అని వారి వివాహబంధం గురించి అనుష్క శర్మ చెప్పుకొచ్చింది.

షాహిద్ కపూర్-మీరా రాజ్‌పుత్
షాహిద్ కపూర్.. సినీ ఇండస్ట్రీలో పలువురితో ఎఫైర్ల అనంతరం మీరా రాజ్ పుత్ ను ట్రేడిషనల్ రొమాన్స్ చపకరాకు.. 2014లో పెళ్లి చేసుకున్నారు. ‘నా మైండ్ లో ఉన్న ఆలోచన ఒకటే. చివరి 15నిమిషాలు మిస్ అయిపోతామేమో అనుకున్నాం’ అని షాహిద్ అన్నాడు. తొలిసారి వాళ్లు కలుసుకున్నప్పుడు ఏడు గంటలపాటు మాట్లాడుకున్నారు. జులై 2015లో న్యూఢిల్లీలో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఐదేళ్ల క్రితం ఓ అదృష్టకరమైన రోజున పరిచయమైన మాకు మిషా, జైన్ లు పుట్టారు.

సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా
ముంబైకు చెందిన యాక్టర్… సోషల్ మీడియాలో టాప్ సెలబ్రిటీగా దూసుకుపోతున్నాడు. లండన్ కు చెందిన వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజా.. భానె అండ్ ఫౌండర్ ఆఫ్ వెజ్ నాన్ వెజ్, మల్టీ బ్రాండ్ స్నీకర్ స్టోర్ ను 2016లో ప్రారంభించారు.

ఒకరోజు రాత్రి స్నాప్ చాట్ లో మేమిద్దరం చాట్ చేసుకున్నాం. నాతో చాటింగ్ చేయొద్దు. మాట్లాడు. అని చెప్పింది. అప్పుడు రెండు గంటలసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు మా స్నేహబంధం బలపడింది. వేగన్ చాక్లెట్లు, స్నీకర్స్ గురించి డీప్ గా మాట్లాడుకున్నాం. అని ఆనంద్ అహుజా అన్నారు. రెండు నెలల పాలో టు లండన్ లో కలుసుకున్న మేము తర్వాత పెళ్లి చేసుకున్నాం. మే 2018లో పెళ్లి చేసుకుని వీరు ఒక్కటవడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.

READ  కిలాడి పక్కన కపూర్ ఫిక్స్ అయింది!

శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
శిల్పా శెట్టి కుంద్రా.. రాజ్ కుంద్రాను ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా కలిశారు. 2017లో బిగ్ బ్రదర్ రియాలిటీ విజేతగా నిలిచింది శిల్పాశెట్టి. పర్‌ఫ్యూమ్ లేబుల్ s2 ప్రమోషన్స్ లో ఆమెకు సాయం చేస్తూ వచ్చారు. నవంబరు 2009లో దాంపత్య బంధంలోకి అడుగుపెట్టాు. వీరికి వియాన్, సమీషా పిల్లలు కూడా ఉన్నారు.

షారూఖ్ ఖాన్-గౌరీ ఖాన్
మూడు దశాబ్దాల క్రితం వివాహ బంధం వీరిది. బాలీవుడ్ పెయిర్లలోనే ఫుల్ ఫ్యామస్. 80వ దశకంలో 18ఏళ్లు వయస్సున్నప్పుడే షారూఖ్ ఆమెతో ప్రేమలో పడ్డారు. ఢిల్లీ యువకుడైన షారూఖ్.. గౌరీని పార్టీలో పూల్ వద్ద కూర్చొని ఉండగా కలిశారు. గౌరీ నెంబర్ తీసుకుని తన పేరు షహీన్ అని చెప్పుకుని ఇంటికి వెళ్లి కలిశారు. ఆరేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిపిన వీళ్లు 1991 అక్టోబరు 25లో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

రాజు బన్ గయా జెంటిల్ మన్ సెట్స్ నుంచి సూట్ అద్దెకు తీసుకుని పెళ్లి చేసుకున్నారట. ఈ రోజున గౌరీ ఇంటీరియర్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఆర్యన్, సుహానా, అబ్రం.

మాధురీ దీక్షిత్-శ్రీరాం
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ లో మాధురీ కూడా ఒకరు. ముంబైకి చెందిన వ్యక్తి డా.శ్రీరాం నేనే(కార్డియో సర్జన్)ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిలో ఒకరు బాలీవుడ్.. ఇంకొకరు లాస్ ఏంజిల్స్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. 1999అక్టోబరు 17న పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఆరంభించారు. మాధురీ అమెరికాలోని డెన్వర్ కు వెళ్లిపోయారు. ఓ దశాబ్ద కాలం వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేసి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ జంటకు ఆరిన్, ర్యాన్ అనే ఇద్దరు కొడుకులు.

జాన్ అబ్రహం-ప్రియా రుంచాల్
మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా 2010లో కలిసిన వీళ్లు 2014 జనవరి 3న ఒక్కటయ్యారు. రుంచాల్ అనే ఎన్నారై ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ను ముంబైలో కలిశారు జాన్. జిమ్ లో కలిసి ఫ్రెండ్స్ అయిన వీళ్లు లైఫ్ పార్టనర్స్ అయ్యారు. లాస్ ఏంజిల్స్ వివాహం భారీ సెలబ్రేషన్ మధ్య వివాహం చేసుకున్నారు.

మ్యాట్ డామన్-లూసియన్ బర్రాసో
మియామీలో స్టక్ ఆన్ యూ షూటింగ్ జరుగుతున్న సమయంలో లూసియానోను కలిశాడు మ్యాట్ డామన్. షూటింగ్ అయిన తర్వాత డ్రింక్ తాగడానికి వెళ్లాడు మ్యాట్. ‘ఎనిమిదేళ్ల క్రితం ఆమెను గుంపు ఉన్న గదిలో కలిశాను. మా దారులు ఎలా కలుస్తాయో ఊహించలేదు. నేను చాలా అదృష్టవంతుణ్ని. ఆమెతో ప్రేమలో పడ్డాను’ అని మ్యాట్ అంటున్నాడు.

READ  కోహ్లీ మరో 6రన్స్ చేస్తే ధోనీ తర్వాత తానే..

Related Posts