నాలాలో బాలిక పడలేదు.. యువకుడు తీసుకెళ్లాడు – స్థానికులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

girl goes missing : నేరెడ్ మెట్ లో కాకతీయనగర్ లో సుమేధ మిస్సింగ్ కేసులో న్యూ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి సుమేధతో ఉండడం చూశానని స్థానికంగా ఉన్న వారు వెల్లడించడం కలకలం రేపుతోంది.ఎక్కడకు వెళుతున్నావని తాను అడిగినట్లు, ఇక్కడ వరకు వెళ్లి వస్తానని సుమేధ  (11) వెల్లడించిందని చందన తెలిపింది. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిపారు.

ఆ యువకుడితో ఎందుకు వెళ్లిందో తెలియడం లేదని, మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉండవచ్చునని స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిచయం లేకపోతే..సుమేధ వెళ్లదని, తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అనుకుంటున్నట్లు చెప్పారు.బాలిక చాలా తెలివైందని, ఎక్కడకైనా వెళితే…ఫోన్ చేసే తెలివి ఉందన్నారు. ఇప్పటి వరకు నాలాలో సుమేధ పడి ఉంటుందని అందరూ భావించారు. కానీ..స్థానికంగా ఉన్న వారు అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.కాకతీయనగర్‌కు చెందిన సుమేధ 11 సంవత్సరాల బాలిక
2020, సెప్టెంబర్ 17 గురువారం సాయంత్రం సైకిల్‌పై బయటకు వెళ్లింది.
కాకతీయనగర్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. సుమేధ సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
కాకతీయనగర్ నాలా వద్ద సుమేధ వెళ్లిన సైకిల్ కనిపించింది. నాలాలో పడిపోయింటుందని అనుమానిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు పోలీసులు.చిన్నారి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేపట్టారు.
శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి పోలీసులు చిన్నారి
ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
ఆగంతకుడు తీసుకెళ్లాడా ? నాలాలో పడిపోయిందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Related Posts