లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

లెక్క తేలింది : GHMC ఎన్నికల్లో 1,121 మంది అభ్యర్థులు

Published

on

1,121 candidates in GHMC elections : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో నిలిచిందెవరో.. నిష్క్రమించిందెవరో తేలింది. ప్రస్తుతం బల్దియా ఎన్నికల బరిలో 1,121 మంది అభ్యర్థులు ఉన్నారు. 150 వార్డులకుగాను.. పోటీలో 1,121 మంది ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో బరిలో ఎంతమంది ఉన్నారన్న దానిపై అధికారులు అర్థరాత్రి పోయిన తర్వాత ప్రకటించారు.బల్దియా ఎన్నికల్లో మొత్తం 2,900లకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తిరస్కరణ, ఉపసంహణ తర్వాత మొత్తంగా ఎంతమంది బరిలో నిలిచారనే వివరాలను అధికారులు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ దాదాపు అన్ని డివిజన్లలోనూ అభ్యర్థులను నిలిపాయి. టీడీపీ నుంచి 105 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక ఎంఐఎం నుంచి సుమారు 50 మంది పోటీలో ఉన్నారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి దాదాపు 500 మందికి పైగా పోటీలో నిలిచారు.చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోని జంగంమెట్‌ డివిజన్‌లో అత్యధికంగా 20మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక అత్యల్పంగా… ముగ్గురు అభ్యర్థులే పోటీలోఉన్న వార్డులు నాలుగు ఉన్నాయి. ఉప్పల్‌, నవాబ్‌సేన్‌ కుంట, టోలీచౌకి, జీడిమెట్లలో ముగ్గురు చొప్పున అభ్యర్థులు బల్దియా ఎన్నికల బరిలో నిలిచారు.


గ్రేటర్ ఎన్నికలు : TRS కు వరద సాయం కలిసి వస్తుందా ?


నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 20 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు
నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన
నవంబర్ 22న నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలుడిసెంబర్ 3న అవసరన ప్రాంతాల్లో రీపోలింగ్
డిసెంబర్ 4న కౌంటింగ్
గ్రేటర్ పరిధిలో 9,248 పోలింగ్ కేంద్రాలు.
1,439 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు.
1,004 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.
257 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *