కొండచరియలు విరిగిపడి 113 మంది సజీవ సమాధి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే…ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కరోనా రాకాసి కారణంగా ఎంతో మంది చనిపోతున్న సంగతి తెలిసిందే. కానీ…మయన్మార్ లో ఊహించని ప్రమాదం ఎదురైంది. కొండచరియలు విరిగిపడి..ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..113 మంది అనంతలోకాలకు వెళ్లిపోయారు.

ఉత్తర మయన్మార్ లోని జాడే గని వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తమ వారు చనిపోయారని తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  కాచిన్ రాష్ట్రంలోని జాడే – రిచ్ హపకాంత్ ప్రాంతంలో మైనర్లు రాళ్లు సేకరిస్తున్నారు. భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. 2020, జులై 02వ తేదీ గురువారం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కింద ఉన్న వారు ప్రమాదం ఊహించేలోపే..విషాదం జరిగిపోయింది.

113 మంది చనిపోయారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సేవా విభాగం, ఇతర అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కకుని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఘటనా స్థలీలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు.. మృతదేహాలను వెలికితీస్తున్నారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మయన్మార్ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది.

దీనిపై ఓ వ్యక్తి స్పందించారు. తాను కొండచరియలు విరిగిపడుతున్న సమయంలో అక్కడనే ఉన్నానని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించానన్నారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. బురదలో ఇరుక్కపోయిన..వారిని రక్షించేందుకు ఎవరూ రాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read:కరోనాతో ఒకేసారి కన్నుమూసిన దంపతులు..చేతిలో చేయి వేసి ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటూ..

Related Posts