రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మొత్తానికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఇవాళ రాజ్యసభ ఆమోదించింది.

విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో పెద్దల సభలో రేగిన దుమారం కొనసాగుతోంది. విపక్ష పార్టీలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్ ‌పై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాయి. హరివంశ్‌ పై అవిశ్వాస తీర్మానానికి 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి.


ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్‌ ప్రజాస్వామిక విలువలకు తూట్లుపొడిచారాని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించామని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్ తెలిపారు.

విపక్షాల ఆందోళనలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెన్‌ ఆరోపించారు.విపక్ష ఆందోళనలను కప్పిపుచ్చేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రభుత్వం​ బిల్లులను ఆమోదింపచేసుకుందని విమర్శించారు.


మొత్తానికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఇవాళ రాజ్యసభ ఆమోదించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ సహా 11 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించినా…బిల్లులకు ఆమోదం లభించింది.

Related Posts