తల్లి..అమ్మమ్మలు చెప్పారని దొంగతనం చేశాడు..చివరకు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చెడు మార్గంలో వెళ్లకుండా చూడాల్సిన తల్లి, అమ్మమ్మలు బాలుడిని దొంగ చేశారు. వారి స్వార్థం కోసం దొంగగా మారి..పోలీసులకు చిక్కాడు. తనను దొంగతనం చేయాలని అమ్మ, అమ్మమ్మలు చెప్పారని బాలుడు చెప్పడంతో..షాక్ తిన్నారు పోలీసులు. తల్లి పరారీలో ఉండగా..అమ్మమ్మకు బేడీలు వేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పార్కు చేసిన ఉన్న వాహనంలో నుంచి రూ. 1.2 లక్షలు దొంగతనానికి గురయ్యాయి. దీంతో బాధితులు డబ్బుు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసును సాల్వ్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. పార్కు చేసిన ప్రాంతం వద్ద సీసీ కెమెరాలున్నట్లు గుర్తించారు. వాటి ఫుటేజ్ లను పరిశీలించారు.12 సంవత్సరాలున్న బాలుడు వాహనంలో నుంచి డబ్బుు తీసినట్లు గుర్తించారు. అతను ఎక్కడుంటాడో ఆరా తీశారు. అతని పట్టుకుని..రూ. 5 వేలు స్వాధీనం చేసుకున్నారు. అసలు దొంగతనం ఎందుకు చేశావని పోలీసులు ప్రశ్నించారు. అమ్మ, అమ్మమ్మలే దొంగతనం చేయాలని చెప్పడంతో తాను ఇలా చేశానని బాలుడు చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఆ అమ్మమ్మను అదుపులోకి తీసుకుని..రూ. 1.05 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా లక్షా 10 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. బాలుడి తల్లి ప్రస్తుతం పరారీలో ఉంది. ఇతని తండ్రి ఉత్తర్ ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు.

Related Posts