12-Year-Old Kerala Student's Paper Train Model Earns Railway Ministry Praise

7వ తరగతి విద్యార్థి పేపర్ ట్రైన్ పై రైల్వే శాఖ ప్రశంసలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేరళకు చెందిన 7వ తరగతి విద్యార్థి రూపొందించిన  పేపర్ ట్రైన్ మోడల్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా విద్యార్థి రూపొందించిన పేపర్ ట్రైన్ మోడల్ ను ప్రశంసించింది. కేవలం మూడు రోజులు,పేపర్, జిగురు…  రైలు మోడల్ యొక్క అద్భుతమైన ప్రతిరూపాన్ని రూపొందించడానికి 7 వ తరగతి విద్యార్థికి అవసరమయ్యాయి. 

కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ కి  చెందిన 12 ఏళ్ల అద్వైత్ కృష్ణ,.. పాత వార్తాపత్రికల 33 షీట్లను, 10 A4 సైజు పేపర్ షీట్లను స్టీమ్ లోకోమోటివ్ మోడల్‌ను నిర్మించడానికి ఉపయోగించాడు. రైల్వే మంత్రిత్వ శాఖ  దీనిని  near perfection(పరిపూర్ణతకు సమీపంలో)గా వర్ణించింది. 

యువ విద్యార్థి ప్రతిభకు  ఇంప్రెస్ అయిన రైల్వే మంత్రిత్వశాఖ ఓ ట్వీట్ లో… కేరళలోని త్రిశూర్‌కు చెందిన 12 ఏళ్ల రైలు ఔత్సాహికుడు మాస్టర్ అద్వైత్ కృష్ణ తన సృజనాత్మక పరంపరను బయటపెట్టాడు. ఓల్డ్ న్యూస్ పేపర్స్ ను ఉపయోగించి ఆకర్షణీయమైన రైలు నమూనాను రూపొందించాడు. సమీప పరిపూర్ణ రైలు ప్రతిరూపం రూపొందించడానికి  అతనికి కేవలం 3 రోజులు పట్టిందని తెలిపింది. 

 అద్వైత్ కృష్ణ రూపొందించిన  పేపర్ రైలు యొక్క ఫోటోలు మరియు వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ గా  మారాయి. సోషల్ మీడియా వేదికగా  అద్వైత్ కృష్ణపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Related Posts