Home » కరోనాతో ఢిల్లీలో ఒకే రోజు 121 మంది మృతి
Published
2 months agoon
By
murthy121 covid deaths In last 24 Hours in Delhi : కరోనా మహమ్మారి మరోసారి ఢిల్లీ నగరాన్నివణికిస్తోంది. గత నాలుగురోజులుగా కరోనా మృతుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. గత 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,512 దాటింది.
పేద దేశాల వ్యాక్సిన్.. 90శాతం ప్రభావంతో.. కంపెనీ కీలక ప్రకటన
నిన్న కొత్తగా 4,454 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 5.34 లక్షలు దాటాయి. ఇందులో 4,88,476 మంది కోలుకోగా, మరో 37,327 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. సోమవారం మొత్తం 37,307 కరోనా టెస్టులు చేయగా, వాటిలో 4,454 పాజిటివ్‌గా తేలింది. దీని ప్రకారం కరోనా సంక్రమణ రేటు 11.94గా ఉందని వెల్లడయ్యింది. ఢిల్లీలో ఇప్పటివరకు అత్యధికంగా నవంబర్ 11న ఒక్కరోజులో 8,593 కేసులు నమోదయ్యాయి