లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఈ 126 రకాల జంతువులు.. కరోనా వైరస్‌లను వ్యాపింపజేయగలవు

Updated On - 1:32 pm, Wed, 24 February 21

126 species could host coronavirus : వందలాది జంతు జాతులు అనేక రకాల కరోనా వైరస్‌లను వ్యాపించచేయగలవని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. క్షీరదాల వంటి జాతుల్లో భిన్నమైన కరోనావైరస్ లు వ్యాపించచేయగలవు. అందులో SARS-COV-2 కూడా ఉందని తేలింది. వీటి నుంచి మరిన్ని కొత్త కరోనా వైరస్ లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటివరకూ సైంటిస్టులు అనేక రకాల జంతు జాతులపై అధ్యయనం చేశారు. కొత్త కరోనా వైరస్ లు వందలాది జంతు జాతులు కరోనావైరస్ కలిగి ఉంటాయని అధ్యయనం సూచిస్తోంది. కరోనా వైరస్ అనేది అతిపెద్ద వైరస్ ల సమూహంగా చెప్పవచ్చు. మనుషుల్లో వ్యాపించే కరోనావైరస్ లు కేవలం ఏడు మాత్రమే తెలుసు.

అందులో SARS-COV, MERS-COV, SARS-COV-2 సహా అన్ని కరోనావైరస్ లు తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులే కాదు.. మరణానికి దారితీయొచ్చు. కానీ, కరోనావైరస్ లు జంతువుల్లో చాలా వేగంగా వ్యాపించగలదు. ఇప్పటికే ఈ జంతు జాతుల్లో వందలాది ఏకైక స్ట్రెయిన్ కలిగిన వైరస్ లను గుర్తించారు. కొన్ని జంతువుల్లో ఒకే సమయంలో భిన్నమైన కరోనావైరస్ లు వ్యాపిస్తాయి. భిన్నరకాల వైరస్ లన్నీ కలిసి కొత్త వైరస్‌లుగా రూపాంతరం చెందగలవు. వాటినే కొత్త కరోనావైరస్ లు అని పిలుస్తారు. ఈ సాధారణ ప్రక్రియనే రీకాంబినేషన్ (పునఃసంయోగం) అని పిలుస్తారు.

SARS-COV-2 అనే కొత్త కరోనావైరస్ కూడా కోవిడ్-19 అనే వ్యాధిని వ్యాపింపచేయగలదు. ఏ జంతు జాతుల్లో ఈ పున: సంయోగం ద్వారా కొత్త కరోనావైరస్ మూలాలుగా ఏర్పడతాయంటే? దానికి సమాధానం.. ఇటీవలే కొత్త అధ్యయనంలో రీసెర్చర్లు ఒక కంప్యూటర్ నమూనాను రూపొందించి అంచనా వేశారు. ఏయే జంతు జాతుల్లో కరోనా వైరస్ ముప్పు ఎక్కువ అనేది తేల్చేశారు. జెన్ బ్యాంకు డేటా ఆధారంగా 876 క్షీరద జాతి జంతువుల్లోని 411 కరోనావైరస్ లతో పోల్చి చూశారు. అవన్నీ కరోనా వైరస్ లను కలిగి ఉన్నాయని తేలింది.

ఒక్కో కరోనా ప్రతి కరోనావైరస్ జాతులు సగటున 12 కంటే ఎక్కువ రకాల క్షీరద హోస్ట్‌లకు సోకుతాయని మోడల్ అంచనా వేసింది. ప్రతి క్షీరద వాహకం సుమారు ఐదు రకాల కరోనావైరస్ లను సంక్రమించవచ్చుననితేలింది. దేశీయ పందిలో వైరస్ వ్యాప్తికి అధిక ప్రమాదాన్ని కలిగిస్తుందని అధ్యయనం పేర్కొంది. వీటిలో అనేక విభిన్న కరోనావైరస్‌లను కలిగి ఉంటాయి. కరోనావైరస్ ను సంక్రమించగల జంతు జాతుల సంఖ్యను శాస్త్రవేత్తలు తక్కువ అంచనా వేస్తున్నారని అధ్యయనం చెబుతోంది.