లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఏపీలో కొత్తగా 129 కరోనా కేసులు

Published

on

కరోనా వైరస్ వల్ల యావత్ ప్రపంచం కుదేలైంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలు ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 41వేల కరోనా పరీక్షలు నిర్వహించగా.. 129 కేసులు పాజిటివ్ వచ్చాయి.

లేటెస్ట్‌గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 87వేల 720కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7వేల 153కి చేరుకుంది.

ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 147మంది పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8లక్షల 79వేల 278కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,289 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.