6 రోజుల క్రితం బాలిక కిడ్నాప్.. రక్షించిన పోలీసులు.. కిడ్నాపర్ అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Delhi Girl Missing For Six Days : ఆరు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన 13ఏళ్ల బాలికను ఢిల్లీ పోలీసులు రక్షించారు. దక్షిణ ఢిల్లీ చత్తార్ పూర్ ఎక్స్ టెన్షన్‌ వద్ద నివసిస్తున్న బాలిక అదృశమైంది. యూపీలోని బరేలీకి చెందిన బాలికను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్‌ను కూడా అరెస్ట్ చేశారు.బాలికతో పాటు కిడ్నాపర్ ను కూడా తిరిగి ఢిల్లీకి తీసుకోచ్చామని పోలీసులు వెల్లడించారు. బాలిక తండ్రి ఎలక్ట్రీషీయన్.. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బాలిక మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయిందని అప్పటినుంచి తిరిగి రాలేదని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు.స్నేహితులు, బంధువులను ఆరా తీసినా బాలిక ఆచూకీ దొరకలేదని పోలీసులకు తెలిపాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.అదృశమైన బాలిక కోసం మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. టెక్నికల్ నిఘా ద్వారా పరీశీలించగా.. చివరికి బరేలిలో గుర్తించారు.

Related Tags :

Related Posts :