లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కేరళలో బర్డ్ ఫ్లూ : 12 వేల 900 కోళ్లను కాల్చేయాలని నిర్ణయం

Published

on

13,000 chickens to be culled In Kerala

ప్రపంచాన్ని వైరస్‌లు వణికిస్తున్నాయి. ఒకటి కాకపోతే..మరొకటి..వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మంకీ వైరస్, కరోనా వైరస్..ఇలా పలు వైరస్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇతర దేశాలకు పాకింది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు.

భారతదేశంలో కూడా వ్యాపించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో వారికి ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా కర్నాటక రాష్ట్రంలో మంకీ వైరస్‌తో ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ 12 వేల 900 కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ కోళ్లను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

కోజికోడ్ జిల్లాల్లో రెండు గ్రామాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు. కొడియాతూర్, వెంగర గ్రామాల్లో రెండు వారాలుగా పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నాయి. అసలు ఎందుకు చనిపోతున్నాయనే విషయం తెలియక పౌల్ట్రీ యజమానులు తలలు పట్టుకున్నారు. వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూర్టీ యానిమల్ డిసీజెస్ సంస్థకు కోళ్ల రక్తనమూనాలను పంపించారు. పరీక్షలు నిర్వహించిన వారు..వాటికి బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. వీటిని చంపకపోతే..మరిన్ని కోళ్లకు విస్తరించి..ప్రజలకు నష్టం చేకూరుతుందని కేరళ ప్రభుత్వం భావించింది. వెంటనే వీటిని కాల్చిపడేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

బర్డ్ ఫ్లూ..కోళ్ల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. గాలి ద్వారా త్వరగా వ్యాపిస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. 12 వేల 900 కోళ్లు బతికి ఉంటే..చాలా ప్రమాదమని, వీటిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా..25 బృందాలను ఏర్పాటు చేసింది. పౌల్ట్రీ సమీపంలో నివాసం ఉండే వారిని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పక్షులకు..ఇతర జంతువులకు సోకిందా ? అని ఆరా తీస్తున్నారు. నష్టపరిహారం కూడా అందించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి శైలజ వెల్లడించారు. 2016లో బర్డ్ ఫ్లూ ద్వారా..అలప్పుజ జిల్లాల్లోని..కుట్టనాడ్‌లో వేలాది బాతులు చనిపోయాయి. 

Read More : కేరళలో ఉమెన్స్ డే : పోలీస్ స్టేషన్‌లో మహిళా SIలకు బాధ్యతలు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *