139మంది అత్యాచారం కేసు.. యాంకర్ ప్రదీప్‌కి ఎలాంటి సంబంధం లేదు, మొదటి దోషి మీసాల సుమన్, రెండో దోషి డాలర్ భాయ్, సంచలన నిజాలు చెప్పిన మందకృష్ణ మాదిగ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hyderabad Rape Victim on Anchor Pradeep:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని  ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున పూర్తి స్థాయి భద్రత కల్పించాలన్నారు. ఈ కేసులో అమాయకులను శిక్షించొద్దు, నిందితులను మాత్రం వదిలిపెట్టొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. సోమవారం(ఆగస్టు 31,2020) సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితురాలికి ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందన్నారు.

యాంకర్ ప్రదీప్ అమాయకుడు:

అదే సమయంలో యాంకర్ ప్రదీప్ కి గుడ్ న్యూస్ చెప్పారు మందకృష్ణ మాదిగ. యాంకర్ ప్రదీప్ కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని మందకృష్ణ స్పష్టం చేశారు. డాలర్ భాయ్ బెదిరించడంతోనే బాధితురాలు యాంకర్ ప్రదీప్ పై కేసు పెట్టిందన్నారు. ఈ మొత్తం కేసులో మొదటి దోషి ఎస్ఎఫ్ఐకి చెందిన మీసాల సుమన్, రెండో దోషి డాలర్ భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి అని మందకృష్ణ మాదిగ చెప్పారు. వారిద్దరిని అరెస్ట్ చేస్తే ఈ మొత్తం ఎసిపోడ్ ముగిసిపోతుందన్నారు. ఈ రేప్  కేసులో అసలు 40శాతం మందికి ఎలాంటి సంబంధం లేదన్నారు మందకృష్ణ మాదిగ.

తాను ప్రత్యక్షంగా బాధితురాలితో మాట్లాడానని మందకృష్ణ మాదిగ చెప్పారు. నిజం ఏదో, అబద్దం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేశానని అన్నారు. ఆదివారం(ఆగస్టు 30,2020) రాత్రి రెండున్నర గంటల పాటు బాధితురాలితో మాట్లాడినట్టు తెలిపారు. అన్ని కోణాల్లో డిస్కస్ చేశాను అన్నారు. బాధితురాలితో మాట్లాడిన తర్వాతే దీనిపై స్పందించాలని అనుకున్నట్టు మందకృష్ణ చెప్పారు. అందుకే ఇంత పెద్ద కేసులో గత 10 రోజులుగా తాను ఏమీ మాట్లాడలేదన్నారు. 139 మంది ఇన్వాల్స్ అయ్యి ఉన్న ఈ కేసులో తొందరపడి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.

అత్యాచారం కేసులో 139 మంది లేరు:
బాధితురాలిపై అత్యాచారం చేసిన వారిలో అన్ని సామాజికవర్గాలకు చెందిన వారు ఉన్నారని మందకృష్ణ చెప్పారు. అదే సమయంలో ఇందులో 139 మంది లేరనే విషయం స్పష్టం అవుతుందన్నారు. బాధితురాలు చెప్పిన ప్రకారం ఇందులో 30శాతం మందే ఉన్నారనే విషయాన్ని కచ్చితంగా చెప్పగలను అన్నారు. మిగిలిన కొంత శాతం మంది డైరెక్ట్ గా అత్యాచారానికి ఒడిగట్టపోయినా.. మానసికంగా, శారీరకంగా బాధితురాలిని కొంత ఇబ్బంది పెట్టినట్లుగా చెప్పారు. కొంతమంది డైరెక్ట్ గా రేప్ చేయకున్నా వేధింపులకు గురి చేశారు. ఈ కేసులో దాదాపు 40శాతానికి పైగా మందికి.. అసలు కేసుకి, బాధితురాలికి ఎలాంటి సంబంధం లేదని మందకృష్ణ అన్నారు. పదేళ్లలో అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒక పర్సెంట్ వారు ఉన్నారు. కొందరు  మానసికంగా బ్లాక్ మెయిల్ చేసిన వారున్నారు. అసలు అత్యాచారాలకు, వేధింపులకు ఎలాంటి సంబంధం లేని వారు 40శాతం మంది ఉన్నట్టు తాను తెలుసుకున్నట్టు మందృష్ణ మాదిగ చెప్పారు.

READ  భారతదేశంలో వరుసగా రెండవ రోజు 83 వేలకు పైగా కరోనా కేసులు.. సెకెండ్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్

మొదటి విలన్ మీసాల సుమన్:

బాధితురాలు చిన్న వయసులోనే బ్లాక్ మెయిల్ కు గురైంది. ఆ తర్వాత అత్యాచారానికి గురైంది. బయట పడే పరిస్థితి లేకుండా పోయింది. అమ్మాయి జీవితం ఇలా కావడానికి అసలు కారణం ఎస్ఎఫ్ఐకి సంబంధించిన మీసాల సుమన్. అతడు దళితుడు. మీసాల సుమన్ ఎపిసోడ్ జీవితం ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి బాధితురాలికి కష్టాలు మొదలయ్యాయి. చదువుకునే రోజుల్లో బాధితురాలికి మీసాల సుమన్ పరిచయం అయ్యాడు. రూమ్ లో బంధించి నగ్నంగా చిత్రించి దారుణానికి ఒడిగట్టారు.

రెండో విలన్ డాలర్ భాయ్:

ఆ తర్వాత ఈ విషయాలన్ని తెలిసిన మరో బ్లాక్ మెయిలర్ డాలర్ భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి బాధితురాలు జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. 139 మందిలో దాదాపు 40శాతం మందికి ఎలాంటి సంబంధం లేదు. 139మందిపై కేసులు పెట్టించి వారిని వేధించి ఆర్థిక లబ్ది పొందేందుకు డాలర్ భాయ్ ప్రయత్నం చేశాడు. అంతేకాదు బాధితురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడు. ఈ కేసులో మొదటి కారకుడు మీసాల సుమన్.. 139 మందిపై కేసు పెట్టడానికి అసలు కారకుడు శ్రీకర్ రెడ్డి అని మందకృష్ణ మాదిగ చెప్పారు. శ్రీకర్ రెడ్డి కూడా అమ్మాయిపై చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకోవడానికి డాలర్ భాయ్ ప్రయత్నం చేశాడు.

ఆ ఇద్దరిని అరెస్ట్ చేస్తే ఎపిసోడ్ ముగుస్తుంది:

మొదటి దోషి మీసాల సుమన్ ను పట్టుకుని అరెస్ట్ చేయగలిగితే, బాధితురాలి జీవితంలో ప్రతి మలుపు రికార్డు కావడానికి అవకాశం ఉంది. డాలర్ భాయ్ ను వెంటనే అరెస్ట్ చేయగలిగితే ఈ ఎసిపోడ్ మొత్తం ముగిసిపోతుంది. ప్రారంభంలో మీసాల సుమన్, ఎండింగ్ లో శ్రీకర్ రెడ్డి.. మధ్యలో కొన్ని ఘటనలు జరక్కపోయినా కేసులు వచ్చాయనేది స్పష్టంగా రుజువు అవుతోంది అని మందకృష్ణ మాదిగ అన్నారు.

అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుంటాం:

ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడితే మా సంఘాలు, కులాల, జాతుల గౌరవం దెబ్బతింటుందని భావించి తాను జోక్యం చేసుకున్నట్టు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆ పరిస్థితిని రానివ్వం. చట్టాన్ని కాపాడుకుంటాం. ఎవరినీ కూడా అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా కాపాడుకుంటాం.

ఈ కేసులో ప్రముఖుల పేర్లు(యాంకర్ ప్రదీప్, కవిత పీఏ సంతోష్ రావు) వచ్చాయి. ఈ రెండు విషయాలపై చాలా డిస్కస్ చేశాము. వాస్తవాలు తెలుసుకుని మేము బయటకు వచ్చాము. వాస్తవాలను బయటకు తీసుకురావాలనే మేము రంగంలోకి దిగారు. ఈ కేసుకి, యాంకర్ ప్రదీప్ కి ఎలాంటి సంబంధమూ లేదు అని నేను చెప్పదల్చుకున్నా. ఏ బిడ్డ బాధపడొద్దు. ఏ కులం, ఏ మతం బిడ్డ అని కాదు. బాధితురాలపై అత్యాచారానికి ఒడిగట్టి, బ్లాక్ మెయిల్ చేసి, నువ్వు కానీ నేను చెప్పిన వారిపై కేసు పెట్టకపోతే, నిన్ను కూడా చంపేస్తామని పద్దతిలో బాధితురాలిని బాధ పెట్టారు.

READ  హైదరాబాద్ లో భారీ వర్షం...ఉస్మానియా ఆస్పత్రిలోకి చేరిన వర్షపు నీరు..రోగులు, వైద్యుల అవస్థలు

యాంకర్ ప్రదీప్ కు ఎలాంటి సంబంధం లేదు:
డాలర్ భాయ్ బ్లాక్ మెయిల్ కు, బెదిరింపులకు తలొగ్గి బాధితురాలు కొందరిపై కేసులు పెట్టింది. అందులో భాగంగానే యాంకర్ ప్రదీప్ పై కేసు పెట్టారు. వాస్తవానికి ఈ కేసుకి ప్రదీప్ కి ఎలాంటి సంబంధం లేదు. కవిత పీఏ అత్యాచారానికి ఒడిగట్ట లేదు కానీ, బాధితురాలి దగ్గర ఉన్న ఫొటోలు ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. అమ్మాయి మీద అత్యాచారానికి ఒడిగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో బాధితురాలిపై బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కు పాల్పడిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసులు పెట్టించిన డాలర్ భాయ్ ని అరెస్ట్ చేయాలి.

నిందితులను వదలొద్దు, అమాయకులను శిక్షించొద్దు:

ఈ కేసులో అమాయకులైన వారిని అరెస్ట్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ కేసులో నిందితులు పలుకుబడి ఉన్నవారు అయితే వారిని వదిలిపెట్టొదు. ఈ కేసులో మూడు కోణాలు ఉన్నాయి. అత్యాచారం కోణం, బ్లాక్ మెయిల్ కోణం, అమాయకులను ఈ కేసు నుంచి తప్పించాలి. నిందితులు అయితే ఏ ఒక్కరిని తప్పించకుండా, ఏ ఒక్క అమాయకుడిని శిక్షించకుండా ఉండటం కోసం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ విచారణ జరిపితే బాధితురాలికి న్యాయం జరిగే అవకాశం ఉంది. బాధితురాలికి ప్రాణహాని ఉంది. పూర్తి స్థాయి భద్రత కల్పించాలి. అమాయకులను శిక్షించొద్దు, నిందితులను మాత్రం వదలొద్దు. పూర్తి వివరాలు తెలియాలంటే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం ”- మందకృష్ణ మాదిగ.

Related Posts