139మంది అత్యాచారం కేసు.. 40శాతం మందికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, సీబీఐ విచారణకు మందకృష్ణ మాదిగ డిమాండ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని మందృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధితురాలికి, కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలన్నారు. ఈ కేసులో అమాయకులను శిక్షించొద్దు, నిందితులను మాత్రం వదిలిపెట్టొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. సోమవారం(ఆగస్టు 31,2020) సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితురాలికి ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందన్నారు.



తాను ప్రత్యక్షంగా బాధితురాలితో కలిసి మాట్లాడానని మందకృష్ణ మాదిగ చెప్పారు. నిజం ఏదో, అబద్దం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేశానని అన్నారు. ఆదివారం(ఆగస్టు 30,2020) రాత్రి రెండున్నర గంటల పాటు బాధితురాలితో మాట్లాడినట్టు తెలిపారు. అన్ని కోణాల్లో డిస్కస్ చేశాను అన్నారు. బాధితురాలితో మాట్లాడిన తర్వాతే దీనిపై స్పందించాలని అనుకున్నట్టు మందకృష్ణ చెప్పారు. అందుకే ఇంత పెద్ద కేసులో గత 10 రోజులుగా తాను ఏమీ మాట్లాడలేదన్నారు. 139 మంది ఇన్వాల్స్ అయ్యి ఉన్న ఈ కేసులో తొందరపడి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.

అత్యాచారం కేసులో 139 మంది లేరు:
బాధితురాలిపై అత్యాచారం చేసిన వారిలో అన్ని సామాజికవర్గాలకు చెందిన వారు ఉన్నారని మందకృష్ణ చెప్పారు. అదే సమయంలో ఈ కేసులో 139 మందిపై అపవాదు ఉండొచ్చు, కానీ, ఈ 139 మంది ఖాయం కాదనే విషయం రుజువు అవుతుందన్నారు. ఇందులో 139 మంది లేరనే విషయం స్పష్టం అవుతుందన్నారు. బాధితురాలు చెప్పిన ప్రకారం ఇందులో 30శాతం మంది మాత్రమే అత్యాచారానికి ఒడిగట్టారనే విషయాన్ని కచ్చితంగా చెప్పగలను అని మందకృష్ణ అన్నారు. మిగిలిన వారిలో కొంత శాతం మంది డైరెక్ట్ గా అత్యాచారానికి ఒడిగట్టకపోయినా.. మానసికంగా, శారీరకంగా బాధితురాలిని కొంత ఇబ్బంది పెట్టారని చెప్పారు.


139 మందిలో 40శాతం పైగా మందికి సంబంధమే లేదు:

కొంతమంది డైరెక్ట్ గా రేప్ చేయకున్నా వేధింపులకు గురి చేశారు. ఈ కేసులో దాదాపు 40శాతానికి పైగా మందికి.. అసలు కేసుకి, బాధితురాలికి ఎలాంటి సంబంధం లేదని మందృష్ణ అన్నారు. పదేళ్లలో అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒక పర్సెంట్ వారు ఉన్నారు, మానసికంగా బ్లాక్ మెయిల్ చేసిన వారు కొంత మంది ఉన్నారు. అసలు అత్యాచారాలకు, వేధింపులకు ఎలాంటి సంబంధం లేని వారు 40శాతం మంది ఉన్నట్టు తాను తెలుసుకున్నట్టు మందృష్ణ మాదిగ చెప్పారు.

అసలు దోషి మీసాల సుమన్:

బాధితురాలు చిన్న వయసులోనే బ్లాక్ మెయిల్ కు గురైంది. ఆ తర్వాత అత్యాచారానికి గురైంది. బయట పడే పరిస్థితి లేకుండా పోయింది. అమ్మాయి జీవితం ఇలా కావడానికి అసలు కారణం ఎస్ఎఫ్ఐకి సంబంధించిన మీసాల సుమన్. అతడు దళితుడు. మీసాల సుమన్ ఎపిసోడ్ జీవితం ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి బాధితురాలికి కష్టాలు మొదలయ్యాయి. చదువుకునే రోజుల్లో బాధితురాలికి మీసాల సుమన్ పరిచయం అయ్యాడు. రూమ్ లో బంధించి నగ్నంగా చిత్రించి దారుణానికి ఒడిగట్టాడు.


రెండో దోషి డాలర్ భాయ్:

READ  దారుణం : అక్క మీద కోపంతో కుక్కను చంపేశాడు

ఆ తర్వాత ఈ విషయాలన్ని తెలిసిన మరో బ్లాక్ మెయిలర్ డాలర్ భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి బాధితురాలు జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. 139 మందిలో దాదాపు 40శాతం మందికి ఎలాంటి సంబంధం లేదు. 139మందిపై కేసులు పెట్టించి వారిని వేధించి ఆర్థిక లబ్ది పొందేందుకు డాలర్ భాయ్ ప్రయత్నం చేశాడు. అంతేకాదు బాధితురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడు. ఈ కేసులో మొదటి కారకుడు మీసాల సుమన్.. 139 మందిపై కేసు పెట్టడానికి అసలు కారకుడు శ్రీకర్ రెడ్డి అని మందకృష్ణ మాదిగ చెప్పారు. శ్రీకర్ రెడ్డి కూడా అమ్మాయిపై చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకోవడానికి డాలర్ భాయ్ ప్రయత్నం చేశాడు.

సినిమా కధను తలపిస్తున్న పంజాగుట్ట అత్యాచారం కేసు

మీసాల సుమన్, డాలర్ భాయ్ ని అరెస్ట్ చేస్తే ఎపిసోడ్ ముగుస్తుంది:

మొదటి దోషి మీసాల సుమన్ ను పట్టుకుని అరెస్ట్ చేయగలిగితే, బాధితురాలి జీవితంలో ప్రతి మలుపు రికార్డు కావడానికి అవకాశం ఉంది. డాలర్ భాయ్ ను వెంటనే అరెస్ట్ చేయగలిగితే ఈ ఎసిపోడ్ మొత్తం ముగిసిపోతుంది. ప్రారంభంలో మీసాల సుమన్, ఎండింగ్ లో శ్రీకర్ రెడ్డి.. మధ్యలో కొన్ని ఘటనలు జరక్కపోయినా కేసులు వచ్చాయనేది స్పష్టంగా రుజువు అవుతోంది అని మందకృష్ణ మాదిగ అన్నారు.


ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం కానివ్వం:

ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడితే మా సంఘాలు, కులాల, జాతుల గౌరవం దెబ్బతింటుందని భావించి తాను జోక్యం చేసుకున్నట్టు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆ పరిస్థితిని రానివ్వం. చట్టాన్ని కాపాడుకుంటాం. ఎవరినీ కూడా అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా కాపాడుకుంటాం. ఈ కేసులో ప్రముఖుల పేర్లు(యాంకర్ ప్రదీప్, కవిత పీఏ సంతోష్ రావు) వచ్చాయి. ఈ రెండు విషయాలపై చాలా డిస్కస్ చేశాము. వాస్తవాలు తెలుసుకుని మేము బయటకు వచ్చాము. వాస్తవాలను బయటకు తీసుకురావాలనే మేము రంగంలోకి దిగారు.

ఈ కేసుకి, యాంకర్ ప్రదీప్ కి ఎలాంటి సంబంధమూ లేదు అని నేను చెప్పదల్చుకున్నా. ఏ బిడ్డ బాధపడొద్దు. ఏ కులం, ఏ మతం బిడ్డ అని కాదు. బాధితురాలపై అత్యాచారానికి ఒడిగట్టి, బ్లాక్ మెయిల్ చేసి, నువ్వు కానీ నేను చెప్పిన వారిపై కేసు పెట్టకపోతే, నిన్ను కూడా చంపేస్తామని పద్దతిలో బాధితురాలిని బాధ పెట్టారు.



యాంకర్ ప్రదీప్ కు ఎలాంటి సంబంధం లేదు:
డాలర్ భాయ్ బ్లాక్ మెయిల్ కు, బెదిరింపులకు తలొగ్గి బాధితురాలు కొందరిపై కేసులు పెట్టింది. అందులో భాగంగానే యాంకర్ ప్రదీప్ పై కేసు పెట్టారు. వాస్తవానికి ఈ కేసుకి ప్రదీప్ కి ఎలాంటి సంబంధం లేదు. కవిత పీఏ అత్యాచారానికి ఒడిగట్ట లేదు కానీ, బాధితురాలి దగ్గర ఉన్న ఫొటోలు ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. అమ్మాయి మీద అత్యాచారానికి ఒడిగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో బాధితురాలిపై బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కు పాల్పడిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసులు పెట్టించిన డాలర్ భాయ్ ని అరెస్ట్ చేయాలి.

READ  అమల్లోకి కొత్త ఎక్సైజ్‌ విధానం

ఏ ఒక్క నిందితుడిని వదలొద్దు, అమాయకులను శిక్షించొద్దు:

ఈ కేసులో అమాయకులైన వారిని అరెస్ట్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ కేసులో నిందితులు పలుకుబడి ఉన్నవారు అయితే వారిని వదిలిపెట్టొదు. ఈ కేసులో మూడు కోణాలు ఉన్నాయి. అత్యాచారం కోణం, బ్లాక్ మెయిల్ కోణం, అమాయకులను ఈ కేసు నుంచి తప్పించాలి. నిందితులు అయితే ఏ ఒక్కరిని తప్పించకుండా, ఏ ఒక్క అమాయకుడిని శిక్షించకుండా ఉండటం కోసం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. సీబీఐ విచారణ జరిపితే బాధితురాలికి న్యాయం జరిగే అవకాశం ఉంది.



బాధితురాలికి ప్రాణహాని ఉంది. పూర్తి స్థాయి భద్రత కల్పించాలి. అమాయకులను శిక్షించొద్దు, నిందితులను మాత్రం వదలొద్దు. పూర్తి వివరాలు తెలియాలంటే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం ”- మందకృష్ణ మాదిగ



Related Posts