appsc uday bhaskar

ఏపీపీఎస్సీ నుంచి జనవరిలో 14 నోటిఫికేషన్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జనవరి నెలాఖరులోగా 1500 ఉద్యోగాల  భర్తీకి ఏపీపీఎస్సీ 14 నోటిఫికేషన్లు విడదల చేస్తుందని  చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు.

విజయవాడ: జనవరి నెలాఖరులోగా 1500 ఉద్యోగాల  భర్తీకి ఏపీపీఎస్సీ 14 నోటిఫికేషన్లు విడదల చేస్తుందని  చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు గత డిసెంబర్ 31 వరకు 3250 ఉద్యోగాల భర్తీకి 21 నోటిఫికేషన్లు ఇచ్చామని శుక్రవారం విజయవాడలో జరిగిన  విలేకరుల సమావేశంలో చెప్పారు.

విడుదల చేసిన నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్షల తేదీలు, ఆయా ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, క్యారీ ఫార్వర్డ్ పోస్టుల వివరాలతో సహా అన్నీ ఇస్తున్నామని ఆయన చెప్పారు. అభ్యర్దులు చివరి నిమిషం వరకు దరఖాస్తులు పంపుతుండటం వల్ల సర్వర్లో సమస్యలు తలెత్తుతున్నాయని, వీలైనంత త్వరగా అభ్యర్ధులు  దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అభ్యర్దులకు ఎదురయ్యే ఓటిపీఆర్ సమస్యను అధిగమించేందుకు హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు ఉదయభాస్కర్ తెలిపారు.

Related Posts