లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కోవాగ్జిన్ కరోనా టీకాతో 14 రకాల సైడ్ ఎఫెక్ట్స్

Published

on

corona vaccine covaxin : కోవాగ్జిన్ కరోనా టీకాతో 14 రకాల సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హైదారబాద్ కు చెందిన తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. టీకా తీసుకొనే ముందు…కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి లబ్దిదారులు తమ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వివరించాలని సూచించింది. అలర్జీలు, రక్తస్త్రావం సమస్యలు, బ్లడ్ థిన్నర్ లు వాడుతున్న వారు, జ్వరంతో ఉన్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వారు కోవాగ్జిన్ టీకాలు తీసుకోకపోవడమే మంచిదని వెల్లడించింది. టీకా తీసుకోవాలని కేంద్రం నుంచి సందేశాలు అందుకున్న వారు..ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంటూ..ఐదు పేజీల కోవాగ్జిన్ టీకా ఫ్యాక్ట్ షీట్ ను భారత్ బయోటెక్ తాజాగా విడుదల చేసింది.

టీకా తీసుకున్న కొందరిలో సాధారణంగా..14 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిపింది. తలనొప్పి, ఒళ్లునొప్పులు, దద్దుర్లు, నీరసం, వికారం, వాంతులు, జ్వరం, ఇంజెక్షన్‌ వేసినచోట నొప్పి, ఎర్రబారడం, దురద, వాపు వంటివి ఉంటాయని తెలిపింది. ఇంజక్షన్ వేసిన చోట..పై భాగం బిగుతుగా..తయారవుతుందని, కొందరిలో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఐదు రకాల సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, మైకంతో కూడిన నీరసం, గుండె కొట్టుకొనే వేగం పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం, ముఖంపై, గొంతులో వాపు రావడం ఏర్పడడం జరుగుతుందని తెలిపింది.
నిర్దేశించిన టీకా కేంద్రాల్లో వీటిని వేయాలి.

రెండు డోసులు వేసుకున్నాక..చివరి డోస్ నుంచి మూడు నెలల వరకు టీకాదారుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ.
టీకా వేసుకున్న వారు అవసరమైతే..భారత్ బయోటెక్ చెందిన టోల్ ఫ్రీ నెంబర్ 18001022245 కు ఫోన్ చేయవచ్చు.
ఒప్పుకున్న వారు కోవాగ్జిన్ టీకా వేసుకొనే ముందు అంగీకారపత్రం పైనా సంతకం చేసి ఇవ్వాలి.