లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

8ఏళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం, తూ.గో.జిల్లాలో దారుణం

Published

on

minor-rape

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సర్పవరంలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలుడు దురాఘతానికి ఒడిగట్టాడు. 8ఏళ్ల boy rape attempt on girlబాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఆందోళన కలిగిస్తున్న పిల్లల్లో విపరీత ధోరణి:
బుద్దిగా చదువుకుంటూ తోటి పిల్లలలో ఆడుకోవాల్సిన వయసులో 14 ఏళ్ల బాలుడు చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది. పిల్లల్లో విపరీత ధోరణి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వయసులో ఇలాంటి నీచపు ఆలోచనలు రావడం ఉలిక్కిపడేలా చేసింది. పిల్లలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? వారి ఆలోచన ఏ విధంగా ఉంది? ఇలాంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు. పిల్లలు చెడు మార్గం పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని పోలీసులు అంటున్నారు.

father rape daughter in west godavari

స్మార్ట్ ఫోన్, ఇంటర్నట్ పుణ్యమా అని:
అలాగే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ పుణ్యమా అని పిల్లలు తప్పుడు దారి పడుతున్నారు. వారి ధోరణిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లో చూడకూడనివి చూస్తున్నారు. కొందరు కామ వాంఛలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి దారుణాలు, ఘోరాలకు అడ్డుకట్ట పడాలన్నా, పిల్లలు చెడు దారిలో వెళ్లకుండా ఉండాలన్నా తల్లిదండ్రులు మేల్కోవాలని పోలీసులు అంటున్నారు. పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వడం మాత్రమే కాకుండా, వారిపై ఓ కన్ను కూడా ఉండాలని సూచిస్తున్నారు.

Read Here>>కూతుర్ని లైంగికంగా వేధించి..చట్టంనుంచి తప్పించుకున్నవారిపై ఓ తండ్రి పోరాటం 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *