15 people killed in Bangladesh train accident..Over 40 injuries

బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం : 15మంది మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బంగ్లాదేశ్ లో ఘరో రైలు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15మంది మృతి చెందారు. మరో 40మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం (నవంబర్ 12) ఉదయం 3 గంటల ప్రాంతంలో దేశ రాజధాని ఢాకాకు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మణబరియాలో జరిగింది.   గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మూడు కంపార్ట్ మెంట్లు నుజ్జు నుజ్జు అయిపోయాయి. 

చిట్టగాంగ్ వైపు వెళ్తున్న రైలు ఢాకా బయలుదేరిన మరో రైలును ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.  ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణీకులంతా నిద్రపోతున్నారు. కాగా ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రావటానికి సిగ్నల్ వ్యవస్థలో ఉన్న లోపమా లేక..సిబ్బంది నిర్లక్ష్యమా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై విచారణాకు అధికారులు ఆదేశించారు. లోపల చిక్కుకున్న ప్రయాణికులను రక్షించడానికి రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోందని బ్రహ్మన్‌బరియా జిల్లా అడ్మినిస్ట్రేటర్ హయత్ ఉద్ దోవ్లా ఖాన్ తెలిపారు.

Related Posts