Home » ఏపీలో పెరిగిన కరోనా కేసులు…24 గంటల్లో 161, ఒకరు మృతి
Published
1 month agoon
161 new corona cases reported in Andhra Pradesh, One died : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. వైరస్ బారినపడిన వారిలో 251 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,985 కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో 8,76,949 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 1,896 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారినపడి 7,140 మంది మరణించారని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో పేర్కొంది.
గత 24 గంటల్లో 36, 091 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,25,76,272 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.