లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

తెలంగాణలో 24 గంటల్లో 1,610 కరోనా కేసులు

Updated On - 10:21 am, Wed, 29 July 20

తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం (జులై 28, 2020) రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కరోనాతో 9 మంది చనిపోయారని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 531 కొత్తగా కేసులు నమోదు అయ్యినట్లు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 15,839 కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో 57,142 కేసులు నమోదు అయ్యాయి. 42,909 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 13,753 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని తెలిపారు. నిన్న రాత్రి ఒక్కరోజే 803 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 480 మంది కరోనాతో పడి మృతి చెందారని వైద్యులు వివరించారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో 340, రంగారెడ్డి జిల్లాలో 172, వరంగల్ అర్బన్ 152, మేడ్చల్ మల్కాజిగిరిలో 113, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో 48 చొప్పున, సూర్యాపేటలో 35, ములుగులో 32, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 26 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 23 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు 3,79,081 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇంకా 809 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.