లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
× About Services Clients Contact
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

తెలంగాణలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు.. 9 మంది మృతి

Published

on

164 corona positive cases in Telangana, nine people died

తెలంగాణలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ రాష్ట్రంలో కరోనా సోకి తొమ్మిది మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 4,484 కి చేరాయి. 174 మంది మృతి చెందారు. తెలంగాణలో 2,032 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,278 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 133 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ 6, రంగారెడ్డి 6, సంగారెడ్డి 4 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్ 3, మహబూబ్ నగర్ 2, కరీంనగర్ 2, ములుగు 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, కామారెడ్డిలో ఒక్కో కరోనా కేసు నమోదు అయ్యాయి. మెదక్, వనపర్తి జిల్లాల్లో కరోనా కేసు నమోదు అయింది. 

దేశవ్యాప్తంగా 3 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిన ఇండియాలో లాక్ డౌన్ 1 తర్వాతే కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 2,903 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం 3 లక్షల 4వేల 19కి చేరుకుంది. ఇందులో మహారాష్ట్రదే మెజార్టీ. లక్షా ఒక వెయ్యి 141కేసులతో అత్యధిక కేసులు ఉంటే తర్వాత రెండు స్థానాల్లో తమిళనాడు 40వేల 698, ఢిల్లీ 34వేల 687ఉన్నాయి. 

మహారాష్ట్రలో కేసులు శుక్రవారంతో లక్ష దాటేశాయి. కొత్తగా 3వేల 717నమోదు కాగా అందులో 127మంది చనిపోయారు. ముంబైలో వెయ్యి 366కేసులు నమోదుకాగా 90మంది చనిపోయారు. ముంబైలో రికవరీ రేటు 47.3శాతంగా ఉంది. ఈ మేర మహారాష్ట్ర రెమెడెసివర్ డ్రగ్ ట్రయల్స్ స్టార్ చేసేసింది. 

లాక్ డౌన్ 1అమలు అయినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిబంధనలు ఎత్తేసి విమాన సర్వీసులు, షాపులు, ఆఫీసులు అన్నింటినీ సేఫ్టీ నియమాలు పాటిస్తూ సామాజిక దూరంతో అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *