17-year-old-girl-gang-raped-at-jhansi-polytechnic-college-other-students-filmed-incident-uttar-pradesh

పాలిటెక్నిక్ కాలేజీలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం…నిందితుల్లో కాలేజీకి చెందిన విద్యార్ధులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Jhansi : తన స్నేహితుడిని కలవటానికి వెళ్లిన పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్ధినిపై కొందరు విద్యార్ధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేస్తూ ఆ దృశ్యాలను వీడియో తీశారు. కాలేజీలో ఆదివారం సివిల్ సర్వీసు పరీక్ష జరుగుతోంది. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికి నిందితులు ఈఘాతకానికి ఒడిగట్టారు.

ఉత్తర ప్రదేశ్ లోని ఝూన్సీలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఆదివారం ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆసమయంలో కాలేజి క్యాంపస్ లో ఈదారుణం జరిగింది.

క్యాంపస్ లో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు 17 ఏళ్ల బాలిక ఆదివారం పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడకు సుమారు 12 మంది విద్యార్ధులు వచ్చారు. వారిద్దరినీ బలవంతంగా కాలేజీలోని క్లాస్ రూమ్ లోకి తీసుకు వెళ్లారు.



అక్కడ వారు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిలో కొందరు ఆమె స్నేహితుడిని కొట్టి బంధించంగా ఒకడు ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం మిగిలిన వారు ఆమెతో లైంగికంగా, అసభ్యంగా ప్రవర్తించారు.

బాలికపై జరుగుతున్న ఈ తతంగాన్నంతా మరి కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. బాధితురాలిపై అత్యాచారం చేసిన అనంతరం.. ఆమె స్నేహితుడివద్ద ఉన్న రూ. 2వేల రూపాయలు లాక్కుని వారంతా పారిపోయారు.



పరీక్ష సెక్యూరిటీకోసం వచ్చిన పోలీసులు బాధితురాలి ఏడుపులు విని ఘటనా స్ధలం వద్దకు వచ్చారు. వెంటనే వారు ఆమెను సిప్రీబజార్ పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల్లో భరత్ అనే వ్యక్తిని బాలికు గుర్తించి పోలీసులకు తెలిపింది.

అతడి ద్వారా ప్రధాన నిందితుడు రోహిత్ సైనిని కూడా పోలీసులు గుర్తించారు. నిందితుడు రోహిత్, భరత్ లు పాలిటెక్నిక్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



మిగిలిని నిందితులను గుర్తించాల్సి ఉందని… వారు కాలేజీ హాస్టల్ కు చెందిన వారో కాదో తెలియదని ప్రిన్సిపాల్ చెప్పారు. ఆదివారం కావటం వలన కాలేజీ మొత్తం మీద ఒకే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడని అతను ఘటన జరిగినప్పుడు ఎక్కడ ఉన్నాడనేది తెలియ లేదని ప్రిన్సిపాల్ వివరించారు.

పట్టుబడిన నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 120బి, 376-డి, 395, 386, 323, ఐటి చట్టంలోని సెక్షన్ 66 డి, పోక్సో చట్టంలోని సెక్షన్ 3/4 కింద ప్రధాన నిందితుడు రోహిత్ సైని, భరత్, మరియు మిగిలిన నిందితులపై కేసులు నమోదుచేశారు. రోహిత్ సైని,భరత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలినినిందితుల కోసం 3 బృందాలను ఏర్పాటు చేసామని ఝూన్సీ ఎస్ఎస్పీ.పీ.దినేష్ కుమార్ చెప్పారు.

READ  టీచర్ నని చెబుతున్నా వినకుండా వేశ్యవంటూ మహిళపై పోలీసుల అత్యాచారం!

Related Posts