ఘోరక్ పూర్ లో ఘోరం..దళిత బాలికను సిగిరెట్ తో కాల్చి గ్యాంగ్ రేప్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నేరాలు అంటే ఠక్కున గుర్తుకొచ్చే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. చిన్నారులపై జరుగుతున్న దారుణ మారణకాండలకు అడ్డాగా మారిపోయింది యూపీ.నేరాల అడ్డాగా ఉందనుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే దేశంలోనే అత్యుత్తమ సీఎంగా యూపీ సీఎం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలిచిన రాష్ట్రంలో ఇటువంటి మారణకాండలకు అద్దు అదుపులేకుండా పోవటం. ఈ క్రమంలోనే యూపీలో మరో చిన్నారి జీవితాన్ని మృగాళ్లు చిదిమేశారు. ముక్కుపచ్చలారని చిన్నారిని ఎత్తుకుపోయి ఒళ్లంతా సిగిరెట్లతో వాతలు పెట్టారు ఆ మృగాళ్లు.వివరాల్లోకి వెళితే..యూపీలోని ఘోరక్‌పూర్‌ జిల్లాలో శుక్రవారం ( ఆగస్టు 14,2020) రాత్రి 8 గంటల సమయం. తెల్లారే నీళ్లు పట్టుకోవడానికి కుదురుతుందో లేదోనని రాత్రి సమయంలోనే నీళ్లు పట్టుకుంటే ఓ పని అయిపోతుందని కదాని 17 సంవత్సరాల దళిత బాలిక… మంచి నీళ్ల కోసం… ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చేతి పంపు దగ్గరకు వెళ్లింది. కానీ తిరిగి రాలేదు.

నీళ్ల కోసం వెళ్లిన కూతురు ఇంకా రాలేదేమా అని ఆ తల్లి ఇంటి బైటకొచ్చి ఎదురు చూస్తోంది. పావు గంట..అరగంట గడిచింది. కానీ కూతురు రాలేదు. దీంతో ఆ తల్లికి కంగారు మొదలైంది. కూతుర్ని పిలుస్తూ ..పంపు దగ్గరకొచ్చింది. కానీ పంప్ దగ్గర కూతురు లేదు..సొట్టలు పడిన బిందె పడి ఉంది. దీంతో తల్లిలో ఏదో ఆందోళన… అటూ ఇటూ తిరుగుతూ గట్టిగా పిలుస్తూ అరిచింది. కానీ బిడ్డ పిలుపు వినిపించలేదు. దీంతో గాభరాపడి భర్తను పిలిచింది. నీళ్లకెళ్లిన కూతురు రాలేదని చెప్పటంతో తండ్రి కూడా కంగారు పడి ఇద్దరూ కలిసి చుట్టుపక్కల వెతికారు ప్రయోజనం లేదు.

అలా బిడ్డ కోసం పిలుస్తూ..తెల్లారే వరకూ ఈ వెతుకులాట సాగింది. చివరకు… పక్క ఊరిలో… ఇటుకల తయారు చేసే ప్రాంతంలో ఓ మూల… ఉదయం ఆమెను చూసిన ఇటుకల తయారీ కార్మికులు… ఆమెను తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో పరుగు పరుగున వెళ్లి చూడగా.. దారుణమైన దుస్థితిలో పడి ఉంది. కూతుర్ని అలా చూసేసరికి ఆ తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది.ఒళ్లంతా సిగరెట్లతో వాతలు పెట్టినట్లుగా ఉంది. అసస్మారక స్థితిలో ఉన్న కూతుర్ని తీసుకుని ఏడ్చుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లారు ఈ సమాచారంతెలుసుకున్న పోలీసులు కూడా హాస్పిటల్ కు వచ్చారు. ఆమెనుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు.

నీళ్ల పంప్ నుంచి తన నోరు నొక్కి… ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లిపోయారనీ..తర్వాత బైక్‌పై బలవంతంగా ఎక్కించి ఇటుక బట్టీల దగ్గరకు తీసుకెళ్లారని తాను అరిచేసరికి నోరు నొక్కేసి..సిగిరెట్లతో వాతలు పెట్టి..దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారని ఒళ్లంతా గాయాలతో ఒళ్లంతా పచ్చి ముద్దలా తయారైన దుస్థితిలో తన గోడు వెళ్లబోసుకుంది ఆ చిన్నారి.అలా తెల్లారే వరకూ ఇలా నరకం చూపిస్తూనే ఉన్నారని చిన్నారి పోలీసులకు చెప్పింది. ఆమె చెప్పేది వింటుంటే పోలీసులు సైతం బాధపడ్డారు. ఇక బిడ్డ నరకయాతన విన్న తల్లిదండ్రుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు చెప్పిన ఆనవాళ్లు ఉన్న వ్యక్తుల గురించి గాలింపు ముమ్మరం చేయగా..కొన్ని గంటల్లోనే… అర్జున్, చోటూ అనే ఇద్దర్ని అరెస్టు చేశారు.

ముక్కు పచ్చలారని తమ బిడ్డ దుస్థితి తలచుకంటూ కన్నవారు ఏడ్చీ ఏడ్చీ ఇప్పుడు కన్నీళ్లు కూడా రావట్లేదు. ఇలాంటి ఎన్నో దారుణాలు ఉత్తరప్రదేశ్ లో నే ఎక్కువగా జరుగుతుండటం గమనించాల్సిన విషయం.


Related Posts