యూపీలో మరో టీనేజర్‌పై రేప్, కాళ్లూచేతులు కట్టేసి అఘాయిత్యం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

barabanki:UPలో మరో టీనేజర్‌పై Rape జరిగింది. ఉత్తరప్రదేశ్ బారబంకీ జిల్లాలోని సట్రఖ్ ప్రాంతంలోని పొలాల్లో 18ఏళ్ల యువతి శవమై కనిపించింది. ఈ ఘటనలో నిందితుడిగా గుర్తించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసుకున్నారు. డిజిటల్ ఎవిడెన్స్ తో పాటు గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా దినేశ్ గౌతమ్(19)అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని అడిషనల్ ఎస్పీ రామ్ సేవక్ గౌతమ్ వెల్లడించారు.

నిందితుడు బాధితురాలితో పాటుగా అదే పంచాయతీకి చెందిన వ్యక్తి అని పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ఇంటరాగేషన్ లో అతని చెప్పిన నిజాలు వెలుగుచూశాయి. ప్రాథమికంగా పోలీసులు మర్డర్ కేసు బుక్ చేసి పోస్టుమార్టం రిపోర్టు తర్వాత ఐపీసీ సెక్షన్ 376ప్రకారం.. రేప్ కేసుగా ఫైల్ చేశారు.



పొక్సో చట్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. కొన్ని డాక్యుమెంట్లలో బాధితురాలు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.

కాళ్లూచేతులు కట్టేసి:

ఆమె నగ్నంగానూ.. చేతులు, కాళ్లు ఎవరో కట్టేసినట్లుగా ఉందని కుటుంబ సభ్యుల్లో ఒకరు ఓ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బాధితురాలి తండ్రి దళిత కార్మికుడు. నిందితుడ్ని తప్పక శిక్షించాలంటూ అతను వాపోతుననాడు.

‘దాడికి కారణమైన వారెవరో గుర్తించి అరెస్టు చేయాలి. మా గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అకారణంగా వేధింపులకు గురవుతున్నారు. పోలీసులు విచారణలో భాగంగా వేధిస్తున్నారంటూ మీడియా ఛానెల్ ముందు వెల్లబోసుకున్నాడు.

బారబంకీ పోలీసులు ఆ కుటుంబంపై ఎటువంటి ఒత్తిడి పెట్టడం లేదంటూ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.



Related Tags :

Related Posts :