లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

18 ఇయర్స్ సక్సెస్‌ఫుల్ జర్నీతో దూసుకెళ్తున్న రెబల్‌ స్టార్ ప్రభాస్..

Published

on

18Years For Prabhas In TFI: టాలీవుడ్‌లో హాలీవుడ్ స్టార్ లాంటి బాడీ లాంగ్వేజ్ అతని సొంతం. డ్యాన్స్, యాక్షన్, ఫైట్స్ ఇలా ప్రతి మూమెంట్స్‌లో అతని స్టైలే వేరు. తెలుగు సినిమాకి ‘ఛత్రపతి’.. ముద్దుగుమ్మలకి ‘డార్లింగ్’, యూత్‌కి ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ ..విలన్స్‌కి మింగుడు పడని ‘మిర్చి’, ఒక మాటలో చెప్పాలంటే తెలుగు సినిమాకి ‘బాహుబలి’.. అతనే టాలీవుడ్ డార్లింగ్, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.

టాలీవుడ్‌కి పాన్ ఇండియా క్రేజ్‌ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ఈ రెబల్‌స్టార్, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈశ్వర్’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. పెద్దగా అంచనాలేవి లేకుండానే హీరోగా పరిచయం అయిన ప్రభాస్‌ తొలి సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి నవంబర్ 11 నాటికి 18 ఏళ్లయ్యింది. ‘ఈశ్వర్’ తో పరవాలేదనిపించినా రెండో సినిమా ‘రాఘవేంద్ర’ తో మాత్రం నిరాశపరిచారు.


హీరోగా ప్రభాస్‌కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘వర్షం’. ఈ సినిమాతో ప్రభాస్ పెర్ఫామెన్స్ బాగా మెరుగై అతణ్ణి స్టార్ హీరోగా మార్చేసింది. ఆ తరువాత మాస్‌ హీరోగా సినిమాలు చేస్తూనే నటుడిగానూ తనని తాను ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేశారు ప్రభాస్‌. మాస్ పెర్ఫామెన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో.. కృష్ణవంశీ తీసిన ‘చక్రం’ లో వెరైటీ నటనతో అలరించారు.

హీరోగా ప్రభాస్ మాస్ ఇమేజ్‌ను పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లిన మూవీ ‘ఛత్రపతి’.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌లా నిలిచిపోయింది. ‘ఛత్రపతి’ తరువాత ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, ఏక్ నిరజంన్, బిల్లా’ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. ఈ యంగ్ రెబల్‌స్టార్ మాస్ ఇమేజ్‌ను పెంచడంలో హెల్ప్ అయ్యాయి.‘డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్’ వంటి రొమాంటిక్ సినిమాలతో క్లాస్ హిట్స్‌ను సొంతం చేసుకున్నారు ప్రభాస్‌. ఈ సినిమాల సక్సెస్‌‌తో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారాయన. ఆ తర్వాత వచ్చిన ‘మిర్చి’ ప్రభాస్ రేంజ్‌ను అమాంతం రెట్టింపు చేసేసింది. అప్పటివరకూ టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ‘మిర్చి’ చిత్రంతో ప్రభాస్‌కు గల స్టార్‌డమ్ తాలూకు ఘాటు మరింత పెరిగింది.

ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్ క్లూజన్’ సినిమాల తరువాత ప్రభాస్ జాతీయ నటుడిగా మారిపోయి టాలీవుడ్‌కి పాన్ ఇండియా క్రేజ్‌తో పాటు బద్దలు కొట్టలేని రికార్డులు తెచ్చిపెట్టారు. ప్రభాస్‌ సినిమాల బడ్జెట్‌ కూడా వందల కోట్లకు చేరుకుంది. ‘బాహుబలి’ నుంచి ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే. ‘బాహుబలి, సాహో’ తర్వాత ఇప్పుడు చేస్తున్న ‘రాధేశ్యామ్’, రాబోయే నాగ్ అశ్విన్, ఓం రౌత్ డైరెక్షన్లో చేయబోయే ‘ఆదిపురుష్’ సినిమాలన్నీ కూడా మొత్తం వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో ముస్తాబవుతున్నాయి.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *