ఏపీలో 24 గంటల్లో 47 కొత్త కరోనా కేసులు 

19 New Coronavirus cases in Andhra pradesh 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షలను వేగవంతం చేయడంతో కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 47 కరోనా కేసులు నమోదయ్యాయి. 9,136 శాంపిల్స్ పరీక్షంచగా.. అందులో 47 మందికి కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే 47 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు.

కరోనాతో చికిత్స పొందుతూ కృష్ణలో ఒకరు మరణించినట్టు వెల్లడించారు. ఏపీలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2561 పాజిటివ్ నమోదైతే.. 1778 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 56 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 727కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో చిత్తూరులో 3 కేసులు, నెల్లూరులో 2 కోయంబేడు (తమిళనాడు) నుంచి మొత్తం 5 మంది వచ్చినట్టు గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చినవారిలో మొత్తం 153 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

అందులో ఒడిశా నుంచి 10 కేసులు, మహారాష్ట్ర నుంచి 101, గుజరాత్ నుంచి 26, కర్ణాటక నుంచి 1, పశ్చిమ బెంగాల్ నుంచి 1, రాజస్థాన్ నుంచి 1, తమిళనాడు నుంచి 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 127గా ఉన్నట్టు హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 

Read: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి

మరిన్ని తాజా వార్తలు