లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

దారుణం :  పుణ్య స్నానానికి వెళ్తే  అత్యాచారం చేశారు.

Published

on

19 year old girl going for holy dip on Makar Sankranti gang-raped in Odisha :  ఒడిషాలో దారుణం జరిగింది. మకర సంక్రాతి పర్వదినానాన పుణ్యస్నానానాకి నదివద్దకు వెళ్తే ఇద్దరు దుండుగులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఒడిషాలోని బారిపాడ పట్టణంలో మకరసంక్రాంతి పండుగ సందర్భంగా ఇద్దరు అక్కా చెల్లెళ్లు పుణ్య స్నానానికి నదికి వెళుతుండగా అదే రోడ్డులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వారిని అనుసరిస్తూ నది వద్దకు వచ్చారు. అందులో ఒక యువతి నీటిలో దిగి స్నానం చేస్తుండగా మరో యువతి ఒడ్డున నిలబడి ఉంది.

వారిని వెంబడిస్తూ వచ్చిన నిందితులు ఒడ్డున ఉన్న నిందితురాలిని పక్కన ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆమె గట్టిగా కేకలు వేయటంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం మహిళలు బరిపాడ పోలీసుస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.