లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

బర్త్ డే పార్టీ పేరుతో….. నమ్మించి అత్యాచారం చేసిన స్నేహితులు

Published

on

birthday party : పుట్టిన రోజు పార్టీ చేసుకుందాం రమ్మని స్నేహితురాలిని పిలిచి…. మత్తు మందు కలిపిని కేకు తినిపించి…. యువతిపై సామూహిక అత్యాచారం చేసారు ముగ్గురు స్నేహితులు.

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో తన తల్లి తండ్రులతో నివసించే ఓ యువతి(19) సికింద్రాబాద్ లోని కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమెకు తమ ఇంటి పరిసరాల్లోని  జోసెఫ్‌, నవీన్‌రెడ్డి, రాములు స్నేహితులు. అక్టోబర్ 5న ఆ యువతి పరీక్ష ఫీజు కట్టేందుకు కాలేజీకి వెళ్లింది.ఆ సమయంలో జోసెఫ్ ఫోన్ చేసి ఆ రోజు తన పుట్టిన రోజని…. నవీన్, రామూలతో కలిసి  పార్టీ  చేసుకుందాం రమ్మని ఆహ్వానించాడు. తనకు పరిచయం ఉన్న స్నేహితులే కనుక ఆ యువతి అందుకు అంగీకరించింది. మిగిలిన ముగ్గురు స్నేహితులు యువతి ఉన్న సికింద్రాబాద్ లోని కాలేజి వద్దకు వెళ్లారు.

అక్కడి నుంచి వారు నలుగురూ ఓ హోటల్ కి వెళ్లారు. ఆ తర్వాత బిర్యానీ పార్సిల్ తీసుకుని ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద కొద్దిసేపు గడిపారు. బిర్యానీ తిన్న తర్వాత మధ్యాహ్నం 3గంటల సమయంలో KPHB లోని ఓ లాడ్జ్ కు వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేయాలని ప్రతిపాదించుకున్నారు.అందరూ లాడ్జి రూం లో ఉండగా..నవీన్ బయటకు వెళ్లి కేక్ కొని తీసుకు వచ్చాడు.ముందస్తు పధకంలో భాగంగా నవీన్ కేక్ పై మత్తు మందు చల్లాడు. రూం లోకి వచ్చి జోసెఫ్ కేకు కట్ చేసి యువతితో ముందుగా తినిపించాడు. అందరం తిందామని ఆయువతి కోరగా ముందు నువ్వేతినాలని ఆమెపై గౌరవం ఒలకబోస్తూ ఆమెతో తినిపించారు.

తిన్నకొద్ది సేపటికే యువతి మత్తులోకి జారుకుంది. స్పృహ కోల్పోయిన యువతిపై స్నేహితులు ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. ఆమెస్పృహలోకి వచ్చి జరిగిన ఘోరం గుర్తించి స్నేహితులను నిలదీసింది. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ బెదిరించి ఆమెను ఆటోలో ఇంటికి పంపించివేశారు.ఆ రోజు నుంచి యువతి అస్వస్ధతకు గురవటం మొదలైంది. కాగా ఈనెల 11వ తేదీన అపస్మారక స్ధితిలోకి వెళ్లగా తల్లి తండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పడు ఆమె తనపై జరిగిన అత్యాచారాన్ని తల్లితండ్రులకు వివరించింది. దీంతో ఆమె తల్లితండ్రులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన సైబరాబాద్‌ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసి కేసును సైబరాబాద్‌కు బదిలీ చేశారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *