షాకింగ్ న్యూస్ : భారత్ లో కరోనా సోకి..196 మంది డాక్టర్లు మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ సోకిన రోగులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో 196 మంది వైద్యులు మరణించారని, ఈ విషయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోకస్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కోరింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది.

ఇండియాలో వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వీరిని రక్షించేందుకు వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారికి కూడ వైరస్ సోకి మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3.50 లక్షల మంది డాక్టర్లు ఉన్నట్లు..అంచనా.

ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితిపై IMA ఆందోళన వ్యక్తం చేస్తోంది. డాక్టర్లు కరోనా బారిన పడితే..వారికి సరియైన వైద్య చికిత్స అందడం లేదని వెల్లడించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మరణించిన 196 మంది వైద్యుల్లో తమిళనాడు నుంచే అధికంగా ఉన్నారు. 43 మంది కరోనా వల్ల చనిపోయారు. మహారాష్ట్ర, గుజరాత్ లో 23 మంది చొప్పున, బీహార్ లో 19 మంది, కర్నాటకలో 15, ఏపీ, ఢిల్లీలో 12 మంది చొప్పున డాక్టర్లు కరోనా వైరస్ బారిన పడి చనిపోయారని వెల్లడించింది.

చనిపోయిన వారంతా…50 ఏళ్లకు పైబడిన వారని సమాచారం. ప్రస్తుతం ఉన్న వైద్యుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టాలని మోడీకి రాసిన లేఖలో IMA కోరింది.

Related Posts