లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

Hathras: విధుల్లోంచి ఇద్దరు డాక్టర్ల తొలగింపు

Published

on

Hathras కేసులో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన జేఎన్ మెడికల్ కాలేజీ ఇద్దరు మెడికల్ ఆఫీసర్లకు సంబంధం ఉందని తెలిసింది. 19 సంవత్సరాల దళిత యువతిని గ్యాంగ్ రేప్, మర్డర్ చేసిన కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానం రావడంతో ఉద్యోగాల్లో నుంచి వారిని తొలగించారు.
స్టేట్ పోలీస్ క్లెయిమ్ చేసిన రిపోర్టుల్లో బాధితురాలు రేప్ కాలేదని ఉంది.. మిగిలిన రిపోర్టుల్లో ఫలితాలు వేరేలా ఉన్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్లను, స్టాఫ్ ను ప్రశ్నించిన తర్వాత డాక్టర్లను పోస్టుల్లో నుంచి తొలిగించేశారు.

యూనివర్సిటీ అధికారులు ఈ ఇద్దరు అధికారులు తాత్కాలికంగా రిక్రూట్ అయ్యారని.. ఎక్కువమంది అనారోగ్యంతో వస్తుండటంతో వారిని తీసుకున్నామని.. ప్రస్తుతం వారిని విధుల్లో నుంచి తొలిగించినట్లు అధికారులు చెప్పారు.

హత్రాస్ కేసులో కీలక ఆధారాలైన సీసీటీవీ ఫుటేజి డిలీట్


అక్కడ బాధిత యువతి కండిషన్ ఇంప్రూవ్ అవలేదని.. న్యూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. సెప్టెంబర్ 14న దాడికి గురైన యువతి ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే సెప్టెంబర్ 29న తుది శ్వాస విడిచింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.
డా. మొహమ్మద్ అజీముద్దీన్ మాలిక్, డా. ఒబైద్ ఇంతియాజుల్ హక్ అనే ఇద్దరు డాక్టర్లను తీసేశారు. సెప్టెంబర్ 14న క్రైమ్ జరిగితే సెప్టెంబర్ 22న వైద్య పరీక్షలు ఎందుకు చేశారని.. మాలిక్ ను సీబీఐ ప్రశ్నించింది. అది తెలుసుకోవడానికి చేసిన టెస్టుల్లో రేప్ జరగలేదని తెలిసిందని.. ఘటన జరిగిన దానికి ఎక్కువ గ్యాప్ రావడంతో ఇలా వచ్చిందని తెలిపాడు.

సెప్టెంబర్ 25న శాంపుల్స్ వచ్చిన తర్వాత యూపీ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. రేప్ జరగలేదని యూపీ పోలీసులు క్లెయిమ్ చేశారు.
రేప్ జరిగిందనే విషయాన్ని నిర్థారించాలంటే.. ఘటన జరిగిన నాలుగు రోజుల లోపే పరీక్షించాలి. 11రోజుల తర్వాత పరీక్ష జరిపితే అందులో ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ అంశం చెప్పకుండా హత్రాస్ ఘటనలో రేప్ జరిగినట్లు రిపోర్టులు చెప్పలేదని మాత్రమే వెల్లడించినట్లు’ వివరించాడు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *