గ్యాంగ్‌రేప్‌కు గురైన ఇద్దరు మైనర్లు.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఐదుగురు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అస్సాంలోని విశ్వనాథ్ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు గిరిజన బాలికలను గ్యాంగ్ రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు ఐదుగురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. ప్రణబ్‌జ్యోతి పత్‌గిరి నిందితులలో ఒకరు. అతనే ఇద్దరు బాలికలను హెలెమ్ లోని ఐసోలేటెడ్ ఏరియా ఇంట్లోకి లాక్కెళ్లాడు.

పత్‌గిరి తనతో పాటు మరికొందరు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసినట్లు వెల్లడించాడు. నిందితులు ఘటనను వీడియో చిత్రించినట్లు కొద్ది రోజుల తర్వాత తెలిసింది. ఆ తర్వాత వీరంతా కలిసి బ్లాక్ మెయిల్ చేసి మరోసారి రేప్ చేయాలనుకున్నారు. శనివారం ఘటనపై పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఆదివారం విశ్వనాథ్ జిల్లా పోలీసులు పలు లొకేషన్లలో ఆపరేషన్ స్టార్ట్ చేసి హెలెమ్ ఏరియాలో ఐదుగురిని అరెస్టు చేశారు. ‘వారందరిపై సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇద్దరు బాధితుల కోసం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇదే కాకుండా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది’ అని సింగ్ అన్నారు.

చట్ట ప్రకారం.. వ్యక్తుల పట్ల యాక్షన్ తీసుకుంటామని అన్నారు. అరెస్టు అయిన ఐదుగురు ప్రణబ్‌జ్యోతి పత్‌గిరి, సోనూ అగర్వాల్, సంజీబ్ ఫుకాన్, దీపక్ గురుంగ్, రాకేశ్ పాయేంగ్ లుగా పేర్కొన్నారు.

Related Posts