నీతో గడుపుతామని ఇద్దరు అమ్మాయిలు డాక్టర్‌కు దగ్గరయ్యారు, రూ.60 లక్షలివ్వాలని బ్లాక్ మెయిల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఇద్దరు మహిళలు ఓ డాక్టరతో గడుపుతామని చెప్పి దగ్గరయ్యారు. అనంతరం రూ.60 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయచటం మొదలెట్టారు. వీరి టార్చర్ తట్టుకోలేని డాక్టర్ పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేయించాడు.

కోల్హాపూర్ లో క్లినిక్ నడుపుతున్న ఓ డాక్టర్ దగ్గరకు ఆరునెలల క్రితం ఇద్దరు మహిళలు వచ్చారు. తమకున్న వ్యాధి లక్షణాలు చెప్పి ఆయన వద్ద మందులు రాయించుకుని వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ డాక్టర్ ఫోన్ నెంబరు తీసుకున్నారు. అవసరం అయినప్పుడు పోన్ చేస్తామని చెప్పారు. అందుకు సమ్మతించి డాక్టర్ తన నెంబరు వారికి ఇచ్చాడు. వారు సతారా కు చెందిన పూనం పాటిల్, ప్రాచీ గైక్వాడ్ .


కొన్నాళ్లకు ఆ మహిళల నుంచి డాక్టర్ స్నార్ట్ ఫోన్ కు వాట్సప్ చాటింగ్ మెసేజ్ వచ్చింది. డాక్టర్ తోవారు ఫ్రెండ్లీ చాటింగ్ మొదలెట్టారు. ఇలా కొంతకాలం ఫ్రెండ్లీగా చాటింగ్ చేసుకున్న తర్వాత మీరంటే ఇష్టమంటూ డాక్టర్ తో ప్రేమాయణం మొదలెట్టారు. ఫ్రెండ్లీ చాటింగ్ కాస్తా రోమాంటిక్ గా మారింది. ఈ క్రమంలో శృంగార పరమమైన చాటంగ్ కూడా చేసుకున్నారు. మీతో గడపాలని ఉందని…… మీ పై కోరిక కలిగిందని చాటింగ్ లో డాక్టర్ ను రెచ్చ గొట్టారు.

డాక్టర్ కూడా ఉత్సాహంగా వారితో రోమాంటిక్ గా వాట్సప్ చాటింగ్ చేయటం ప్రాంరంభించాడు. డాక్టర్ చేస్తున్న రొమాంటిక్ చాటింగ్ ను మహిళలిద్దరూ స్క్రీన్ షాట్లు తీసుకోవటం మొదలెట్టారు. ఇది తెలుసుకోని డాక్టర్ వారితో రోమాంటిక్ గానే చాట్ చేస్తున్నాడు.


ఉన్నట్టుండి ఒకరోజు వారు డబ్బు అవసరం పడిందని….రూ. 12 లక్షల రూపాయలు సర్దుబాటు చేయాలని డాక్టర్ ను అడిగారు. వారికి నిజంగా డబ్బు అవసరమై ఉండి ఉంటుందని భావించిన డాక్టర్ వారు చెప్పిన మైనర్ యువతికి ఆ డబ్బు అందచేశాడు.

మరలా కొన్నాళ్లకు ఆ మహిళలు రూ. 48 లక్షలు కావాలని డాక్టర్ ను కోరారు, అంత డబ్బు తాను ఇవ్వలేనని తన వద్ద డబ్బు లేదని… ఇటీవలే రూ. 12 లక్షలు ఇచ్చా కదా అని డాక్టర్ అన్నారు. అవేమి పట్టించుకోని మహిళలు తమకు డబ్బుకావాల్సిందేనని పట్టుబట్టారు. తన వద్ద డబ్బు లేదని డాక్టర్ చేతులెత్తేశాడు.


దీంతో మహిళలు డాక్టర్ తమతో చాటింగ్ చేసిన రోమాంటిక్ వాట్సప్ మెసెజ్ లు స్క్రీన్ షాట్లు పంపించారు. మేము అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఈ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించారు. డాక్టర్ పోలీసులను సంప్రదించాడు. పోలీసులు చెప్పినట్లు ప్లాన్ పక్కాగా అమలు చేశాడు.సరే…… డబ్బులిస్తాను రమ్మని ఆ మహిళలకు ఒక అడ్రస్ చెప్పాడు. ఉత్సాహంగా డబ్బు తీసుకోటానికి మరోక మైనర్ బాలికతో ఆ మహిళలిద్దరూ డాక్టర్ చెప్పిన ప్రదేశానికి వచ్చారు. అక్కడ అప్పటికే మాటు వేసిన పోలీసులు మహిళలిద్దరినీ మైనర్ యవతిని అదుపులోకి తీసుకున్నారు.

 

Related Tags :

Related Posts :