డ్రైవర్ వేధింపులు..కారులో నుంచి దూకేసిన మహిళలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

2 women jump : కామంతో కళ్లుమూసుకపోతున్నాయి కామాంధులకు. ఏమి చేస్తున్నామో తెలిమని మైకంలో చెలరేగిపోతున్నారు. దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తమకు రక్షణ లేదా అని నిలదీస్తున్నారు మహిళలు.


క్యాబ్ లో వెళుతుండగా..కారు డ్రైవర్ వేధింపులను తప్పించుకోవడానికి ఇద్దరు మహిళలు కారులో నంచి దూకేశారు. అందులో మరో మహిళను స్థానికులు కాపాడారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఎస్‌హెచ్‌ఓ రాబిన్‌ హాన్స్‌ కథనం ప్రకారం…అమృత్ సర్ లో శనివారం సాయంత్రం రంజిత్ అవెన్యూ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ కు వెళ్లేందుకు ముగ్గురు మహిళలు క్యాబ్ బుక్ చేసుకున్నారు. అనంతరం వచ్చిన క్యాబ్ లో ముగ్గురు వెళుతున్నారు. కొద్దిదూరం వెళ్లిన అనంతరం ఓ మహిళ పట్ల డ్రైవర్ వేధింపులకు గురి చేశాడు.


ప్రతిఘటించడంతో..కారును వేగంగా పొనిచ్చాడు. ప్రమాదాన్ని గుర్తించిన మహిళల్లో ఇద్దరు వెళుతున్న కారులో నుంచి కిందకు దూకేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. ఇదంతా చూస్తున్న స్థానికులకు విషయాన్ని చెప్పారు. వెంటనే వారు కారును ఛేజ్ చేశారు. అందులో ఉన్న మహిళను రక్షించారు. క్యాబ్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు…కొద్ది గంటల్లోనే..క్యాబ్ డ్రైవర్ ను పట్టుకున్నారు.

Related Posts