లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

థాయిలాండ్‌ లో బస్సును ఢీకొట్టిన రైలు.. 20 మంది మృతి

Published

on

Thailand bus, train collide థాయిలాండ్‌ లో ఇవాళ(అక్టోబర్-11,2020) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంట్రల్ థాయిలాండ్ లో ఉదయం 8:05 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి.

రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. మృతులంతా ఓ ప్యాక్టరీకి చెందిన కార్మికులుగా గుర్తించారు.బ్యాంకాక్‌ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందు వెళ్తుండగా రాజధాని బ్యాంకాక్ కు 50కిలోమీటర్ల దూరంలోని క్లోంగ్ క్వాయింగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చా చోంగ్‌సావో ప్రావిన్స్‌ గవర్నర్‌ మైత్రీ త్రితిలానంద్‌ తెలిపారు. టూరిస్ట్‌ బస్సు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా సరుకు రవాణా రైలు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *