సోషల్ మీడియాలో రెబల్‌స్టార్ రికార్డ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rebelstar Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. ‘రాధేశ్యామ్’, నాగ్ అశ్విన్ సినిమా, బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆదిపురుష్’ ఈ సినిమాల లైనప్ చూస్తుంటే మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరింపచేయనున్నాడని కొత్తగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో డార్లింగ్ మరో రేర్ ఫీట్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు.

సోషల్ మీడియాలో మిగతా స్టార్స్‌లా అంత యాక్టివ్‌గా ఉండకపోయినా ప్రభాస్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య మాత్రం మిలియన్లలో ఉంటుంది. తన క్రేజ్‌కి ఇది జస్ట్ స్మాల్ ఉదాహరణ మాత్రమే.


ఇటీవల ట్విట్టర్‌లో మిలియన్స్‌లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఫేస్‌బుక్ పేజీకి 20 మిలియన్ల ఫాలోవర్స్ రావడంతో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 20 మిలియన్ల ఫాలోవర్స్ అనేది సెన్సేషన్ అనే చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటి వరకూ ఏ హీరోకి అంతమంది ఫాలోవర్స్ లేరు. సౌత్ ఇండియాలో ఎక్కువమంది ఫాలోవర్స్ కలిగిన ఉన్న మొట్టమొదటి హీరో, ఈ ఘనత సాధించిన 8వ ఇండియన్ యాక్టర్‌ ప్రభాసే కావడం విశేషం. ఈ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంటుందనేది కొత్తగా చెప్పనవసరం లేదు..


Related Posts