20 Million+Views & Counting for Viswasam Trailer-10TV

తళ అజిత్ సరికొత్త రికార్డ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

20 మిలియన్స్ వ్యూస్, 1.3 మిలియన్స్ లైక్స్‌తో, యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది అజిత్ కొత్త సినిమా ట్రైలర్.

తళ అజిత్, నయనతార జంటగా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతున్న మూవీ, విశ్వాసం. వీరం, వేదాళం, వివేగం తర్వాత, అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో రాబోతున్న నాలుగవ సినిమా ఇది. ఇంతకుముందు రిలీజ్ చేసిన అజిత్ లుక్స్‌కీ, టీజర్ అండ్ సాంగ్స్‌కీ భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడ విశ్వాసం ట్రైలర్ ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ దాటేసి, సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 30వ తేదీ మధ్యాహ్నం, విశ్వాసం తమిళ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. విడుదల చేసిన అతి తక్కువ టైమ్‌లోనే రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్‌లతో సోషల్ మీడియాని షేక్ చేసేసింది ఈ ట్రైలర్.

కేవలం 24 గంటల్లో, 14.1 మిలియన్ల వ్యూస్, 1.2 మిలియన్ల లైక్స్‌తో, సౌత్ ఇండియాలోనే కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని, తళ ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా 20 మిలియన్స్ వ్యూస్, 1.3 మిలియన్స్ లైక్స్‌తో, యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది అజిత్ కొత్త సినిమా ట్రైలర్. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ప్రతి నిమిషం సరైన అప్ డేట్స్ ఇస్తూ, వ్యూస్ కౌంట్ చేస్తూ, సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నారు తళ వీరాభిమానులు.

విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో, ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న విశ్వాసంలో అజిత్ డ్యుయెల్ రోల్ చేసాడు. జగపతి బాబు స్టైలిష్ విలన్‌గా కనిపించబోతున్నాడు. డి.ఇమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన విశ్వాసం, సంక్రాంతి కానుకగా, జనవరి 10న, తమిళనాట గ్రాండ్‌గా రిలీజవబోతోంది.

వాచ్ విశ్వాసం తమిళ ట్రైలర్…

Related Posts