లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

చనిపోయి ఐదుగురి ప్రాణాలను కాపాడిన చిన్నారి

Published

on

ఊహ కూడా పూర్తిగా తెలియని వయసు.. నిండుగా 20నెలలుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిన పాప.. కన్నవారికి సోకాన్ని మిగిల్చి వెళ్తూ వెళ్తూ ఐదుగురి ప్రాణాల‌ను కాపాడింది. ఢిల్లీలోని రోహిణికి చెందిన ధ‌నిష్తా అనే 20 నెల‌ల చిట్టిత‌ల్లి.. చిన్నవయస్సులో ప్రాణదాతగా మారి ఈ లోకాన్ని విడిచింది.

జనవరి 8వ తేదీన ఇంటి బాల్కనీలో నుంచి కింద పడిన చిన్నారి ధనిష్తాను గంగారామ్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. 11వ తేదీన బ్రెయిన్ డెడ్ అవడంతో ప్రాణాలు కోల్సోయే పరిస్థితిలోకి వచ్చింది.

ఈ సమయంలో త‌ల్లిదండ్రులు ఆశిశ్ కుమార్‌, బ‌బితా.. చిన్నారి అవ‌య‌వాల‌ను దానం చేయాల‌ని నిర్ణ‌యించగా.. ఆ అవ‌యవాలతో ఐదుగురి ప్రాణాల‌ను కాపాడిన‌ట్లు డాక్టర్లు వెల్లడించారు.

పాప గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాల‌ను ఐదుగురు పేషెంట్ల‌కు అందించగా.. అవ‌య‌వాల కోసం చూస్తున్న ప‌లువురిని క‌లిసినప్పుడు మేం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆశిశ్ కుమార్ చెప్పారు. మా పాప చ‌నిపోయినాబ ఆ ఐదుగురిలో బతికే ఉంటుంద‌ని భావించి అవయవాలు దానం చేసినట్లు తల్లిదండ్రులు చెప్పారు.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *