Categories
Political

చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్  

విజయనగరం:ఏపీ ని బిజెపి అభివృద్ధి చేసిందో, టిడిపి అభివృద్ధి చేసిందో తేల్చేందుకు సిఎం చంద్రబాబునాయుడు చర్చకు రావాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమువీర్రాజు సవాల్ విసిరారు. వంద ధృత రాష్ట్రులతో సమానమైన చంద్రబాబునాయుడికి రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదన్నారు. రాజకీయాల్లో నిబద్ధతను చంద్రబాబునాయుడు తుంగలోకి తొక్కారని ఆయన విమర్శించారు. రాష్ర్టాన్ని బిజెపి యే అభివృద్ధి చేసిందని,యుసి కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని సోమువీర్రాజు అన్నారు.

Categories
Andhrapradesh Education and Job

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందచేసింది. దాదాపు 1.389 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ 2018, డిసెంబర్ 31 సోమవారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో 169 గ్రూప్ 1, 446 గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు,లెక్చరర్, సీనియర్ ఎకౌంటెంట్ ,డిప్యూటీ తహసిల్దార్  వంటి పోస్టులను భర్తీ చేస్తారు.గ్రూప్ 1 పోస్టులకు జనవరి 7 నుంచి 28 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. గ్రూప్ 2 పోస్టులకు  జనవరి 10 నుంచి 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.మే 5న గ్రూప్‌-2 ప్రాథమిక పరీక్ష, జులై 18, 19 తేదీల్లో గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. 
పోస్టుల వివరాలు:
169 గ్రూప్ 1
446 గ్రూప్ 2
292 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ 
154 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 
150  ఏఎస్‌వో పోస్టులు సాధారణ పరిపాలన శాఖలో 
20 సీనియర్‌ అకౌంటెంట్లు
50 ఎస్‌ఐ పోస్టులు ఎక్సైజ్‌ డిపార్ట్ మెంట్
40 ఎక్స్‌టెన్షన్‌ అధికారులు పంచాయతీరాజ్‌ డిపార్ట్ మెంట్  
16 డిప్యూటీ తహశీల్దార్లు 
13 సీనియర్‌ అకౌంటెంట్లు ట్రెజరీ డిపార్ట్ మెంట్  
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో  405 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 
ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు లెక్చరర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  
మత్స్యశాఖలో  43 పిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 308 లెక్చరర్‌ పోస్టులకు  ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఫిషరీస్‌ సబ్‌ సర్వీస్‌లో 10 అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ పోస్టులకు  జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8వరకు, 
ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌లో 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్‌ పోస్టులకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ  విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Categories
National

అన్నదాతకు అండగా : బెంగాల్‌లో కూడా రైతు బంధు

కోల్ కతా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు తెలంగాణకు వచ్చి పథకాల రూపకల్పన..కార్యచరణలను పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా, రైతు బంధు పథకాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేసేందుకు సన్నద్ధమౌతున్నాయి. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ పథకాలపై ద‌ృష్టి సారించారంటే ఇది ఎంత సక్సెస్ అయ్యిందో చెప్పాల్సినవసరం లేదు. 

ఒడిశా..జార్ఖండ్ బాటలో వెస్ట్ బెంగాల్…
తాజాగా రైతు బీమా, రైతు బంధు పథకాలను తమ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని ఒడిశా, జార్ఖండ్ రాష్ర్టాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎకరానికి సంవత్సరానికి రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించేశారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య ఉన్న రైతులకు మరణిస్తే రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం సంబంధిత కుటుంబానికి అందజేస్తామని మమత స్పష్టం చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె పేర్కొన్నారు. 

తెలంగాణలో…
తెలంగాణలో రైతుబంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి రూ. 8 వేల పెట్టుబడి చొప్పున ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పెట్టుబడి సాయాన్ని మరో రూ. 2 వేలు పెంచి మొత్తంగా సంవత్సరానికి రూ. 10 వేల పెట్టుబడి సాయం చేస్తామని కేసీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో హామీనిచ్చారు..ఇవ్వడమే కాకుండా…రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎకరానికి రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం చేయనున్నారు. రైతుబీమా కింద రూ. 5 లక్షల పరిహారాన్ని అందజేస్తున్నారు. 

Categories
National Political

బుధవారం కలుద్దాం : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ రగడ

ఢిల్లీ : లోక్ సభలో ఆమోదం పొందింది..ఇక రాజ్యసభలో ఆమోదం పొందాలి…బిల్లు ఆమోదం పొందుతుందని బీజేపీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ దానికి మోకాలడ్డుతోంది. ముస్లిం మహిళల హక్కు కోసమంటూ బీజేపీ తీసుకొచ్చిన ‘తలాక్ బిల్లు’ లోక్ సభలో ఆమోదం పొంది రాజ్యసభ మెట్లు ఎక్కింది. ఇక పెద్దలు దీనిని ఆమోదింప చేయాల్సి ఉంది. అయితే…బిల్లులో అభ్యంతరకర అంశాలున్నాయంటూ కాంగ్రెస్ వాదులాటకి దిగుతోంది. ఇంకేముంది…రాజ్యసభ వాయిదా…లు..పడుతూనే ఉంది. ఇక ప్రయోజనం లేకపోవడంతో బుధవారానికి వాయిదా పడింది. 

మండిపడుతున్న ప్రతిపక్షాలు…
ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి…రాజ్యసభలో బీజేపీకి తగిన సంఖ్యాబలం లేదు. తలాక్ బిల్లును జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపాల్సిందేనని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ మేరకు చేసిన తీర్మానంపై ఇప్పటికే 11 పార్టీలు సంతకాలు చేశాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ముందు ఈ తీర్మానంపై ఓటింగ్ జరపాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటింగ్ జరిపమని..చర్చ మాత్రం చేద్దామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రెండు పక్షాలూ తమ సభ్యులకు విప్ కూడా జారీ చేసి మరీ సభకు వస్తున్నాయ్. కాంగ్రెస్ మాత్రం సభలో బిల్ పాసయ్యే వీలే లేదని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కోరుతున్న సవరణలు చేస్తే..ఆ క్రెడిట్ వాటికి దక్కుతుందని బిజెపి..బిల్ తీసుకొచ్చిన ఘనత బిజెపికి దక్కకూడదని విపక్షాలు గేమ్ ఆడుతుండటంతో..అసలు ఈ సమావేశాల్లో తలాక్ చట్టం రూపొందుతుందో లేదో అనుమానంగా మారింది. 

Categories
Business National

తగ్గిన వంట గ్యాస్ ధర: నూతన సంవత్సర కానుక

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు నూతన సంవత్సర కానుక అందచేసింది. వంటగ్యాస్ ధరలను తగ్గిస్తు నిర్ణయం తీసుకుంది. రాయితీ లేని సిలిండర్ పై రూ.120-50 పైసలు తగ్గించింది. రాయితీగల సిలిండర్ పై రూ.5.91 పైసలు తగ్గించింది. తగ్గించిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.ప్రస్తుతం ఢిల్లీలో  14.2 కేజీలు ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర రూ.500.90 పైసలుగా ఉంది. ధర తగ్గి ఇప్పుడు రూ.494.99 పైసలుకు వినియోగదారులకు అందనుంది. వినియోగదారుడుకి ప్రభుత్వం సంవత్సరానికి 12 సబ్సిడీ సిలిండర్లను అందచేస్తోంది. రాయితీ లేని సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీ లో రూ.809-50 పైసలు కాగా రేపటినుంచి  దాని ధర రూ.689.50 పైసలు కానుంది.

Categories
Health Life Style

స్మోక్ చేయని ఉద్యోగులకు కంపెనీ ఆఫర్స్

స్మోకింగ్ అలవాటు లేని ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. స్మోకింగ్ చేసేవారి కంటే అదనంగా ఆరో రోజుల పాటు సెలవులు ప్రకటించింది. స్మోకింగ్ అలవాటును మాన్పించేలా తమ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు జపాన్ కంపెనీ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

  • ఏడాదిలో అదనంగా ఆరు రోజులు సెలవులు.. ప్రకటించిన జపాన్ కంపెనీ

  • స్మోకింగ్ మానేసిన నలుగురు ఉద్యోగులు.. వర్క్ ఔట్ అయిన ఆలోచన

మానండిరా బాబూ.. స్మోకింగ్ అంటే ఎవరూ వింటారు చెప్పండి.. ఆఫీసులో అవర్స్‌లో స్మోకింగ్‌తో కాలం వృథా చేస్తే పని చేసేది ఎక్కడా. అందుకే జపాన్ కంపెనీ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్మోకింగ్ చేయని ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి ఏడాదిలో ఆరో రోజుల పాటు సెలవులు ప్రకటించింది. స్మోకింగ్ అలవాటును మాన్పించేలా తమ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు జపాన్ కంపెనీ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. పియాలా ఇంక్ అనే మార్కెంటింగ్ కంపెనీ జపాన్‌లో ఉంది. స్మోకింగ్ చేసే ఉద్యోగుల సంఖ్య స్మోకింగ్ చేయని ఉద్యోగుల కంటే 35 శాతం ఎక్కువగా ఉన్నారట. స్మోకింగ్ అలవాటు కారణంగా కంపెనీలో పనిచేసే సమయం డిస్టర్బ్ అవుతుందనే భావించింది.

మాములుగా చెబితే వింటారా..
అందుకే స్మోకింగ్ చేయని ఉద్యోగులకు ప్రతి ఏడాదిలో అదనంగా ఆరు రోజులు సెలవులు ఇస్తున్నట్టు కంపెనీ ఆఫర్ చేసింది. ఇలానైనా స్మోకింగ్ చేసేవారంతా తమ అలవాటు మానుతారని అభిప్రాయపడింది. తమ సంస్థ విధివిధానాల్లో కొన్ని మార్పులు చేసి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. కంపెనీ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం.. స్మోకింగ్ చేయని ఉద్యోగులే. ఆఫీసు 29వ ఫ్లోర్‌లో ఉంటే.. స్మోకింగ్ రూం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. స్మోకింగ్ పేరుతో తోటి ఉద్యోగులంతా బ్రేక్‌లు మీద బ్రేక్‌లు తీసుకుంటున్నారు. వర్క్ అట్మాస్పియర్‌ను దెబ్బతింటోందని  కంపెనీ మేనేజ్‌మెంట్‌కు నాన్ స్మోకర్స్ ఫిర్యాదు చేశారు. 

ఏడాదిలో 15 నిమిషాలు స్మోకింగ్‌కే..
ఆఫీసు 29వ ఫ్లోర్‌లో ఉంటే.. స్మోకింగ్ రూం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. స్మోకింగ్ చేసేవారంతా ఏడాదిలో ప్రతిరోజు సిగరేట్ తాగేందుకు దాదాపు 15 నిమిషాలు హెచ్చిస్తున్నట్టు కంపెనీ అంచనా వేసింది. అందుకే స్మోకింగ్ చేయని ఉద్యోగులకు అదనపు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో స్మోకింగ్ చేసేవారిలో నలుగురు స్మోకింగ్ మానుకోవాలని నిర్ణయించుకున్నారట. నిజానికి జపాన్ దేశంలో స్మోకింగ్ కల్చర్ ఎక్కువనే చెప్పాలి. జపనీస్‌లో దాదాపు 18 శాతం మంది స్మోకింగ్ చేస్తారంటే నమ్ముతారా? ఓ నివేదిక ప్రకారం.. జపాన్‌లో ప్రతి ఏడాదికి దాదాపు 1,30వేల మంది స్మోకింగ్ సంబంధిత రోగాలతో మృతిచెందుతునట్టు వెల్లడించింది. అక్కడి ప్రభుత్వం కూడా పబ్లిక్ ప్లేస్‌ల్లో స్మోకింగ్ చేయకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోంటోంది.

మరోవైపు భారత్‌లోనూ స్మోకింగ్ సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. పెనాల్టీలు, ఫైన్‌లు వేసే బదులు.. జపాన్ తరహాలో భారత్‌లో కూడా తమ ఉద్యోగులకు కంపెనీలు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తే చాలావరకు స్మోకింగ్ చేసేవారి సంఖ్య తగ్గిపోయే అవకాశాలు లేకపోలేదు. 

Categories
Movies

మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌

దుబాయ్‌లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొఫెషన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, పర్సనల్ లైఫ్‌కి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. షూటింగ్‌కి కాస్త గ్యాప్ దిరికితే చాలు, భార్యా, పిల్లల్ని తీసుకుని విదేశాల్లో వాలిపోతాడు. ఇప్పుడు కూడా మహర్షి షూట్‌కి కొంచెం గ్యాప్ ఇవ్వడంతో, న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్ వెళ్ళాడు. చిల్లింగ్ ఎట్ మిక్స్ విత్ బాయ్స్, ది న్యూ హాట్ స్పాట్ అంటూ, అక్కడ సరదాగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న ఒక ఫోటోని ఇన్‌స్టా‌గ్రామ్‌లో అప్ లోడ్ చేసాడు.

క్యాజువల్ లుక్‌లోనే సూపర్‌గా ఉన్నాడు సూపర్ స్టార్..  జనరల్‌గా మహేష్, గౌతమ్, సితారల ఫోటోలు లాంటివి నమ్రత పోస్ట్ చేస్తుంటుంది. కానీ, ఈ సారి స్వయంగా మహేష్ బాబే పోస్ట్ చెయ్యడం విశేషం. మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని గట్టిగా జరుపుకోబోతున్నాడని అర్థమవుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా మూవీ యూనిట్, మహర్షి సెకండ్ లుక్ రిలీజ్ చెయ్యగా, అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. కొద్ది రోజుల తర్వాత తిరిగి మహర్షి షూటింగ్‌కి అటెండ్ అవుతాడు మహేష్. 

Categories
Crime Hyderabad

డ్రగ్స్ ముఠా అరెస్టు  

హైదరాబాద్: నగరంలో ప్రజలంతా నూతన సంవత్సర వేడుకల సంబరాల్లో మునిగితేలే వేళ నగర పోలీసులు డ్రగ్స్ రాకెట్ ను అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లోడ్రగ్స్ వినియోగిస్తారనే సమాచారంతో నిఘా పెంచిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జోసెఫ్ అలమేధ,శంకర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ.10  లక్షల విలువైన  89 గ్రాముల కొకైన్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 
వీరిద్దరూ నైజీరియన్స్ నుంచి డ్రగ్స్ కోనుగోలుచేసి ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్,జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో  మ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రాము కొకైన్ 3వేలకు కొని , దానిని 6నుంచి 7 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిసింది. 
 

Categories
National

ట్రాన్స్‌ఫార్మర్ కోసం : కలెక్టర్ కాళ్లు పట్టుకున్న రైతు

మధ్యప్రదేశ్ : దేశానికి రైతన్న వెన్నెముక…ఆ రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుంది. రైతుకు ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తామని చెప్పి అధికార సీట్లో కూర్చొన్నాక పట్టించుకోవడం మానేస్తుంటారు. దీనితో ఆ రైతన్న ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తుంటాడు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా..ప్రాధేయపడినా కొంతమంది అధికారులు కనికరించరు. 
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని…తద్వార తన సమస్య కొంత తీరుతుందని శివ్‌పురి జిల్లాకు చెందిన అనిల్ జాదవ్ అనే రైతు ఎంతో మంది అధికారులను కోరాడు. ప్రాధేయపడ్డాడు. రోజులు గడుస్తున్నాయి కానీ తన సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అనే చందంగానే ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ రావాలంటే ఏం చేయాలో ఆలోచించాడు. 
శివ్‌పురి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో నూతనంగా వచ్చిన కలెక్టర్ అనుగ్రహ్ బయటకు వెళుతున్నారు. ఒక్కసారిగా కలెక్టర్ కాళ్లపై పడ్డాడు. తన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు. ‘బెహన్ జీ..మేరీ బాత్ సునో’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చేతిలో ఎండిపోయిన పంట..కన్నీళ్లు పెట్టుకోవడంతో కలెక్టర్ స్పందించారు. సమస్యను మొత్తం సానుకూలంగా విన్నారు. ఆ రైతన్నకు ధైర్యం చెప్పారు. సమస్యను పరిష్కరిస్తానని…విచారణ చేయిస్తానని హామీనిచ్చి కారులో వెళ్లిపోయారు. 

#WATCH Shivpuri(Madhya Pradesh): A farmer breaks down and falls to the feet of the newly appointed Collector Anugrah P seeking her intervention for installation of a new transformer in his village. The transformer was installed later. (28.12.18) pic.twitter.com/GPOe3ydnv4

— ANI (@ANI) December 31, 2018

Categories
Movies

మహర్షి సెకండ్ లుక్

నూతన సంవత్సరం సందర్భంగా మహర్షి సెకండ్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా, మహర్షి.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో,  అశ్వినీ దత్, పీవీపీ, దిల్ రాజు నిర్మిస్తుండగా, అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్‌గా, పూజాహెగ్డే హీరోయిన్‌గా చేస్తుంది.
నూతన సంవత్సరం సందర్భంగా మహర్షి సెకండ్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఫస్ట్ లుక్‌లో చేతిలో బుక్‌తో కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించిన సూపర్ స్టార్, సెకండ్ లుక్‌లో సూటూ, బూటు గెటప్‌లో అదరగొట్టేసాడు. రెయిన్ ఎఫెక్ట్‌లో ఒక చేతిని పాకెట్‌లో పెట్టుకుని, గాగుల్స్‌తో, సూపర్ స్టార్ అలా స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు.

ఒక స్ట్రీట్‌లో ఆయన నడుస్తుండగా, వెనక ఇద్దరు విదేశీ అసిస్టెంట్స్ తన వెనకే ఫాలో అవుతుండగా, ఒకతను గొడుగు పట్టుకున్నాడు. మహేష్‌కి ముందు అవుట్ ఫోకస్‌లో కొంతమంది నడుస్తున్నారు. మొత్తానికి ఈ న్యూ లుక్‌లో మహేష్ చాలా బాగున్నాడనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్, స్టూడెంట్‌గా, రైతుగా, సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

ఈ లుక్ చూస్తుంటే, రిషి అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించడం ఖాయం అనిపిస్తుంది. జగపతి బాబు, జయసుధ, నవీన్ చంద్ర, సోనాల్ చౌహాన్ తదితరులు నటిస్తున్న మహర్షికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చుస్తున్నాడు. 2019 ఏప్రిల్‌లో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.